AP: పిల్లలపై క్షుద్రపూజల కలకలం.. ముమ్మిడివరంలో స్థానికుల ఆందోళన..!

కోనసీమ జిల్లా ముమ్మిడివరం బల్లగేట్ సెంటర్ లో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తోన్నాయి. దాదాపు 15 రోజులుగా ఓ వ్యక్తి తమ పిల్లలపై క్షుద్రపూజలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం బయటికి రావాలంటేనే భయపడుతున్నామని ఆందోళన చెందుతున్నారు.

New Update
AP: పిల్లలపై క్షుద్రపూజల కలకలం.. ముమ్మిడివరంలో స్థానికుల ఆందోళన..!

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తోన్నాయి.  బల్లగేట్ సెంటర్ ఓ ఇంట్లో దాదాపు 15 రోజులుగా ఓ వ్యక్తి క్షుద్రపూజలు చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టు పక్కల నివాసంలో ఉంటున్న పిల్లల చిత్రలను కాగితలపై గీసి క్షుద్ర పూజలు చేసి పసుపు, కుంకుమలను పొట్లం కట్టి గుమ్మం దగ్గర వేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.

Also Read: హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‌లో అధికారుల తనిఖీలు.. బయటపడిన షాకింగ్ నిజాలు.!

గ్రామంలో తమ పిల్లలపై చేతబడి వంటి కార్యక్రమాలు చేస్తున్నాడని, అటు వైపు వెళ్లాలంటేనే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో తమ పిల్లల ఆకారంతో బొమ్మలు వేసి, పిల్లలు వేసుకునే బట్టలు ఎత్తుకెళ్లి పసుపు కుంకుమతో పూజలు చేసి తిరిగి తమ ఇళ్ళలోకి వేస్తున్నాడని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: టీడీపీ నేత దారుణ హత్య.. వేట కొడవళ్ళు, కత్తులతో పొడిచి..

పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమపై కూడా క్షుద్ర ప్రయోగం చేస్తాడనే భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేక పోతున్నామని స్థానికులు మీడియా ముందు తమ బాధను చెప్పుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chandrababu: గురుకులాన్ని సందర్శించిన చంద్రబాబు.. స్టూడెంట్స్ తో ముచ్చట్లు!

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను, సరుకులను పరిశీలించారు.

New Update
Chandrababu Nandigama Tour

Chandrababu Nandigama Tour

Advertisment
Advertisment
Advertisment