Telangana Elections: బుల్డోజర్లతో వెళ్లి నామినేషన్ వేసిన తెలంగాణ బీజేపీ నేత.. వీడియో వైరల్! ఎన్నికల నామినేషన్ పర్వం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన ఆర్వో కార్యాలయానికి బుల్డోజర్లతో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడీయో వైరల్ అవుతోంది. By V.J Reddy 09 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Nominations: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు అందరూ నామినేషన్లు వేసేందుకు ఆర్వో ఆఫీసులకు పయనమయ్యారు. అయితే, ఈ రోజు నామినేషన్ వేసేందుకు బుల్డోజర్లతో ఆర్వో ఆఫీసుకు చేరుకున్నారు ఓ నాయకుడు. ఆ నాయకుడు ఎవరో కాదు బీజేపీ నుంచి పటాన్‌చెరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందీశ్వర్ గౌడ్(Nandishwar Goud). దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ALSO READ: రేవంత్ రెడ్డిని ఓడిస్తే నరేందర్ రెడ్డికి ప్రమోషన్.. కేటీఆర్ సంచలన ప్రకటన! అనంతరం నందీశ్వర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డిని ఓడిస్తామని అన్నారు. మహిపాల్ రెడ్డి ఆక్రమించిన అక్రమ ఆక్రమణలను కూల్చివేస్తామన్న బీజేపీ వాగ్దానానికి బుల్డోజర్ ర్యాలీ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలంతా బీజేపీవైపే మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ఈసారి పటాన్‌చెరులో ఎగిరేది గులాబీ జెండా కాదని.. ఎగిరేది కాషాయ జెండా అని అన్నారు. ALSO READ: BJP Final List: ఆ 11 మంది ఎవరు?.. కొనసాగుతున్న ఉత్కంఠ! #TelanganaElections2023 బుల్డోజర్లతో వెళ్లి నామినేషన్ వేసిన పఠాన్ చేరు బీజేపీ పార్టీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్#TeluguNews#BJP4Telangana #TelanganaNominations pic.twitter.com/q4zt1ZlbFA — తాజా వార్తలు (@thajavarthalu) November 9, 2023 *పటాన్‌చెరులో BJP ప్రభంజనం* బీజేపీ అభ్యర్ధి టీ నందీశ్వర్ గౌడ్ గారి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీ లో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పటాన్ చెరు యువత.@narendramodi @JPNadda @AmitShah @kishanreddybjp @BJP4Telangana @sunilbansalbjp… pic.twitter.com/iDg9s7RTvO — Thouti Nandeshwar Goud (@GThouti) November 9, 2023 #telangana-elections-2023 #bjp-candidate #bulldozer-rally మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి