Telangana Elections: ఈసారి ఓడించకుంటే రాజకీయ సన్యాసమే.. ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాల్.. బిజెపి కార్యకర్తలు భగభగ మండే సూర్యుడు లాంటి వాళ్ళని అలాంటి వారి జోలికొస్తే చల్ల ధర్మారెడ్డిని మసి చేస్తారని మొలుగూరి భిక్షపతి హెచ్చరించారు. పరకాల నియోజకవర్గంలో ఎక్కడికిపోయినా ధర్మారెడ్డిని తరుముతున్నారని అన్నారు. పరకాలలో చల్ల ధర్మారెడ్డిని ఓడించకుంటే రాజకీయ సైన్యం తీసుకుంటాను సవాల్ విసిరారు. By Shiva.K 10 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి BJP Leader Moluguri Bikshapathi: బిజెపి కార్యకర్తలు భగభగ మండే సూర్యులు ఆని, వారిని ఎదిరించే దమ్ము ధైర్యం బిఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) చల్లా ధర్మరెడ్డికి లేదని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల పట్టణంలోని బిజెపి(BJP) కార్యాలయంలో మంగళవారం పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పరకాల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు మొలుగూరి బిక్షపతి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరకాల మున్సిపాలిటీ కార్యాలయానికి 2013లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిలాపాలకం వేస్తే నిర్మించేందుకు 10 సంవత్సరాల కాలం పడుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ రావడంతోనే ప్రతి జిల్లాలో, పట్టణాలలో ప్రభుత్వ కార్యాలయాలు రెండు మూడు సంవత్సరాల్లోపు నిర్మిస్తే మన పరకాల కార్యాలయాలు మాత్రం పది సంవత్సరాలు పట్టిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి త్వర త్వరగా శంకుస్థాపనలు చేయడం చేయడం సిగ్గుచేటని అన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి పరకాల ఎమ్మెల్యేగా ఉండి ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇప్పుడు శిలాఫలకాలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలలో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ లాంటివి నిర్మించి ప్రారంభిస్తే పరకాలలో మాత్రం ఒక డిగ్రీ కాలేజ్ నిర్మించడం కూడా సాధ్యం కానీ ఎమ్మెల్యే మనకు అవసరమా అని అన్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో 1,210 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మించి ఇస్తే మిగతా 20వేల మందికి ఎప్పుడు నిర్మిస్తారని అన్నారు. గృహలక్ష్మి పథకం కోసం నియోజకవర్గ పేద ప్రజలు తమ చిన్న చిన్న ఇండ్లను కూలగొట్టుకొని పిల్లర్లు నిర్మించుకుంటే ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారని ప్రశ్నించారు. గృహలక్ష్మి నిర్మాణానికి అప్పులు తీసుకోచ్చుకొని నిర్మాణాలు ప్రారంభించామని ఎంతోమంది బాధపడుతూ ఉంటే వాళ్ళని చూస్తే కడుపు తరుకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి కార్యకర్తలు భగభగ మండే సూర్యుడు లాంటి వాళ్ళని అలాంటి వారి జోలికొస్తే చల్ల ధర్మారెడ్డిని మసి చేస్తారని హెచ్చరించారు. పరకాల నియోజకవర్గంలో ఎక్కడికిపోయినా ధర్మారెడ్డిని తరుముతున్నారని, అలాంటి వ్యక్తి పరకాల్లో బిజెపి ఎక్కడ ఉందని ప్రశ్నించడం హాస్యాస్పదమని అన్నారు. పరకాలలో చల్ల ధర్మారెడ్డిని ఓడించకుంటే రాజకీయ సైన్యం తీసుకుంటాను సవాల్ విసిరారు. బిజెపి నాయకులు ఆర్ పి జయంతి లాల్, దేవనూరు మేఘనాథ్ ,కొలనుపాక భద్రయ్య మాట్లాడుతూ పరకాల ఆకాంక్ష అమరవీరుల జిల్లా చేయాలని ప్రజలందరూ స్వచ్ఛందంగా సోమవారం బంద్ ప్రకటించుకోవడం ప్రజల్లో ఉన్న ఐకమత్యానికి ప్రతిక అని అన్నారు. పరకాలలో చల్లా ధర్మరెడ్డికి ఓటే వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. పరకాల మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నాడని, అధికార పార్టీకి తొత్తుగా ఉంటున్న ఆయనపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మేకల రాజువీరు, పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్, ఉపాధ్యక్షులు నాగేలి రంజిత్, పాలకుర్తి తిరుపతి, పట్టణ కోశాధికారి మంతెన సంతోష్ ,సోషల్ మీడియా ఇంచార్జ్ బొచ్చు వరప్రసాద్,సీనియర్ నాయకులు పిట్ట వీరస్వామి, దుబాసి వెంకటస్వామి, సర్వాపూర్ ఉపసర్పంచ్ దండు సురేష్, బూత్ అధ్యక్షులు బీరం రాజిరెడ్డి, కృపెందర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ దార్న నారాయణదాసు, కానుగుల గోపీనాథ్, కోడేపాక ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. Also Read: TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..! Nara Lokesh CID: ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ #parakala-ex-mla-moluguri-bikshapati #parakala-ex-mla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి