ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన సంగతి తెలిసిందే.మార్క్ ఆ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడి హైదరాబాద్‌కి చేరుకున్నాడు. ఈ క్రమంలో మార్క్ ని ఇంటికి తీసుకుని వచ్చిన తరువాత రోజే..పవన్ సతీమణి అన్నా లెజోనావా తిరుమలకు వెళ్లారు.
Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!
/rtv/media/media_files/2025/04/14/anna-lezhneva-pawan-kalyan-11-503541.jpg)
అక్కడ ఆమె డిక్లరేషన్ ఫామ్ పై సంతకాలు చేసి..స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. మరుసటి రోజు స్వామి వారిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా ఆమెనే అన్నప్రసాదాలను వడ్డించి,వారితోనే కలిసి కూర్చుని భోజనం చేశారు. అంతేకాకుండా మార్క్ పేరు మీద అన్న ప్రసాదాలకు విరాళాలు కూడా అందించారు.
Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !
అన్నా భారతీయ స్త్రీ కాకపోయినప్పటికీ ఆమె స్వామి వారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించడం, సేవచేయడం వంటివి చేయడంతో జనసేన అభిమానులు,పవన్ అభిమానులు ఆవీడియోలను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఆమెకు భారతీయ సంస్కృతి మీద, దేవుని మీద ఉన్న భక్తిని కొనియాడుతున్నారు.
కానీ ఈ క్రమంలో తెరమీదకు మరో అంశం చర్చకు వచ్చింది.ఆమె తలానీలాలు సమర్పించడం కరెక్ట్ కాదు అంటూ కొందరు వాదిస్తున్నారు.
నిజమైన సనాతనంలో ఇది తగదంటున్నారు మరి కొందరు ఆధ్యాత్మిక వేత్తలు. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్మాత్మిక గురువు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు కి చెందిన ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు. సనాతనం తెలిసిన హిందూ మహిళలు మూడు కత్తెరలు మాత్రమే ఇవ్వాలని చెబుతున్నారు. ముఖ్యంగా ముత్తయిదువులైన మహిళలు అస్సలు ఆ పని చేయకూడదంటున్నారు.
గుండు చేయించుకోవడం అశుభమంటున్నారు. మొక్కులు చెల్లించడం, జుట్టు ఇచ్చేయడం పరిపాటిగా మారిందని..దీనిని ఓవర్ యాక్షన్ అంటారంటున్నారు. పూర్వం ఎవరూ అలా చేయలేదని చెబుతున్నారు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడూ అలా చేయకూడదంటున్నారు. దీనికి లాజిక్ కావాలంటే సాధ్యం కాదని, కొన్ని యోగశాలలో రుజువైతే మరి కొన్ని యాగశాలలో నిరూపితమౌతాయని ఆ వీడియోలో ఉంది.
ఇదిలా ఉంటే...మరో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి అనంతలక్ష్మి మాటల వీడియో పోస్ట్ చేస్తున్నారు. మహిళలు తల నీలాలు సమర్పించడంలో తప్పు లేదంటున్నారు అనంతలక్ష్మి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..
Also Read: USA-China: అమెరికా, చైనా టారిఫ్ వార్‌లో బిగ్‌ట్విస్ట్.. ఒప్పందానికి రానున్న ఇరుదేశాలు !
ap | tirumala | Anna Lezhneva In Tirupat | Anna Lezhneva Offering Hair at Tirumal | Pawan Kalyan Wife Anna Lezhneva | Pawan Kalyan Wife Anna Lezhnava offerd Hair | latest-news