డబుల్ బెడ్ రూమ్ సమస్యల ఎజెండాతో బీజేపీ ఫైట్ !

డబుల్ బెడ్‌రూమ్ సమస్యలపై బీజేపీ చేపట్టిన మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(జులై 25) ధర్నా చౌక్‌లో నిరసన చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఒక కేబినెట్ మినిస్టర్ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటని హైకోర్టు నిలదీసింది.

New Update
డబుల్ బెడ్ రూమ్ సమస్యల ఎజెండాతో బీజేపీ ఫైట్ !

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ప్రజా సమస్యలపై పోరుబాట పట్టింది. రేషన్ కార్డుల పంపిణీ, ధరణి రద్దుతో పాటు డబుల్ బెడ్ సమస్యలనే ఎజెండాగా చేసుకొని ఆందోళనకు దిగుతోంది. ఇందులో భాగంగా ముందుగా అన్ని జిల్లా కేంద్రాల్లో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలపై ఈ రోజు నుంచి ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది బీజేపీ. రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నాకు పిలుపునిచ్చారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దీనికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.

BJP fight with the agenda of double bedroom issues!

వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల పంపిణీ ఆలస్యంపై ఆందోళనలకు రెడీ అయ్యారు. రైతు రుణమాఫీ, ధరణి రద్దు పై ఉద్యమాలు చేస్తామన్నారు కిషన్ రెడ్డి. అదే విధంగా నేతలు దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములు సర్కార్ వెనక్కు తీసుకోవడంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నిర్ణయించారు.

మరో వైపు బీజేపీ అనుబంధ  మోర్ఛాలు  ఉద్యమ కార్యచరణకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అనుబంధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలతో కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఈక్రమంలోనే  అనుబంధ కమిటీల మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చారు. 100 రోజుల ప్రణాళిక పై వర్కవుట్  చేయాలని బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను కిషన్ రెడ్డి ఆదేశించారు.  దీంతో కార్యచరణ పై మోర్చాల నేతలు దృష్టి పెట్టారు.

మరోవైపు ఎన్నికల నిర్వహణకు 22 కమిటీలు వేయాలని బీజేపీ నిర్ణయించింది. మేనిఫెస్టో, చార్జిషీట్, మీడియా ప్రచార కమిటీ, పబ్లిక్ మీటింగ్స్, టాకింగ్ పాయింట్స్, ఫీడ్ బ్యాక్ ,స్టాటిస్టిక్స్, అదర్ స్టేటస్ కో  ఆర్డినేటర్స్ కమిటీ సహా 22 కమిటీలు వేయాలని డిసైడ్  అయ్యింది . ఇక 100 రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో సీరియస్ గా  వర్క్ బీజేపీ వర్క్ స్టార్ట్ చేసింది.

ఇక కొత్త బాస్ గా కిషన్ రెడ్డి బాధ్యతలు కూడా స్వీకరించడంతో స్పీడ్ పెంచుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను బీజేపీ నేతలు పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు నిర్మాణాలు పూర్తయిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పారదర్శకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు మాత్రం బీ ఆర్ ఎస్ కార్యకర్తలకు కేటాయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడ్చల్ జిల్లా  మేడిపల్లి మండలం పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ లో డబుల్ బెడ్ రూం లిస్ట్ లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నాయకుల అనుచరులకు మాత్రమే కేటాయించారంటూ మేడిపల్లి ఎమ్మార్వో ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు ధర్నాలు చేశారు. ఇప్పటి వరకు ఎమ్మార్వోలు పట్టాలు ఇచ్చిన వారి లిస్ట్ ను ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు ధర్నాను భగ్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు