కిషన్ రెడ్డిని ఢిల్లీకి ఎందుకు పిలిచారు? హఠాత్తుగా సమావేశంలో నుంచి ఎందుకు వెళ్లిపోయారు? అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని వెంటనే బయలుదేరిరావలసిందిగా అధిష్టానం ఆదేశించింది. ఆయన ఆఘమేఘాలమీద ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అదీ సమావేశం మధ్యలో నుంచి. ఇంత హఠాత్తుగా కిషన్ రెడ్డిని ఎందుకు పిలిపించినట్టు? మణిపూర్ రావణకాష్ఠంలా రగులుతూనే ఉంది. ఈ అంశంపై చర్చించి తీరాలని పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల ఇన్ ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి కి కేంద్రం ఏ డైరక్షన్ ఇవ్వబోతోంది? By P. Sonika Chandra 01 Aug 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి సమయం : మంగళవారం ఉదయం స్థలం : హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం అజెండా: అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించిన వ్యూహాలపై చర్చ ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేతలంతా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి, టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు . 3వ తేదీన నిర్వహించే అసెంబ్లీ సమావేశాలపై చర్చిస్తారు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. అయితే సమావేశం మధ్యలో నుంచే కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. ఎందుకంటే రేపు సౌత్ ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ఉత్తర ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో ఇప్పటికే భేటీ అయిన ప్రధాని పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు కౌంటర్ ఎటాక్ పై దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా సౌత్ ఎంపీలకు కూడా చేయనున్నారు.దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. దీనిపై మధ్యాహ్నం మీడియాతో ఎమ్మేల్యే రఘునందన్ రావు మాట్లాడనున్నారు. అయితే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై విస్తారంగా చర్చించడానికి 30 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని బీజేపీ పట్టుబడుతోంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇప్పటికే సీఎం కేసీఆర్ కు లేఖ కూడా రాశారు. అయితే అసెంబ్లీ నాలుగు గోడల మధ్య మినీ వార్ జరగనుంది. దీని కోసం అధికార,ప్రతిపక్షాలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీలను ఇరుకున పెట్టాలని అధికార పక్షం బాస్ పెద్ద స్కెచ్ వేసినట్టు సమాచారం.రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందో.. గత తొమ్మిదేళ్లుగా బీజేపీ కేంద్రంలో ఉండి రాష్ట్రానికి ఏం మేలు చేసిందో.. అన్నీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలతో రాష్ట్ర ప్రజలకు చేరేట్టుగా.. అదే విధంగా ఈ రెండు పార్టీలను ఇరికించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మరోవైపు ఎన్నికలకు ముందుగా జరుగుతున్న చివరి అసెంబ్లీ సమావేశాలను సాధ్యమైనంత వాడుకొని పార్టీలకు మైలేజ్ పెంచుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు చేసే పనిలో పడ్డాయి. దీనిలో భాగంగా అసెంబ్లీలో అనుసరించాల్సి వ్యూహాలపై ప్రధాన ప్రతిపక్షాలు ఫోకస్ పెట్టాయి. అయితే రుణమాఫీ, వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం పై ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ ను కార్నర్ చేయాలని ప్రతిపక్షాలు వ్యూహాలను రచిస్తున్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి