బిర్యానీ దెబ్బకు నేతల అబ్బ.. తలలు పట్టుకుంటున్న అభ్యర్థులు..!

ఎన్నికలొస్తే పార్టీలకు, కార్యకర్తలకు పండగ వాతావరణమే. మందు, బిర్యానీ లేని రోజంటూ ఉండదు. అయితే ఈసారి ఎన్నికల ప్రచారాల్లో మందు, బిర్యానీల మాట వినిపించదా అన్న అనుమానం తలెత్తుతోంది. ఎలకన్ కమిషన్ ప్రకటించిన భారీ ధరలతో నేతలు మందు, బిర్యానీ అంటేనే భయపడుతున్నారు..

New Update
బిర్యానీ దెబ్బకు నేతల అబ్బ.. తలలు పట్టుకుంటున్న అభ్యర్థులు..!

ఎన్నికలొస్తే పార్టీలకు, కార్యకర్తలకు పండగ వాతావరణమే. మందు, బిర్యానీ లేని రోజంటూ ఉండదు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. అమావాస్య తరువాత నాయకులంతా తమ ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. జెండాలు పట్టుకుని తిరిగే కార్యకర్తలను వెతుకుతున్నారు. బిర్యానీ, మందు లేకుంటే నాయకుల వెంట ఒక్కడు కూడా ప్రచారానికి రాడన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలకు ఎన్నికల కమిషన్‌ మాత్రం షాకిచ్చింది. చికెన్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీలకు భారీగా ధరలు ప్రకటించింది. చికెన్‌ బిర్యానీ రూ. 140 (గ్రామాల్లో 100), మటన్‌ బిర్యానీ రూ. 180 (గ్రామాల్లో)గా నిర్ణయించింది. ఈ ధరల ప్రకారమే ఎన్నికల ఖర్చులు లెక్కిస్తామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు, అభిమానులకు బిర్యానీలు పంపకం ఎలా అని నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇకపై ప్రచారాల్లో మందు, బిర్యానీల మాట వినిపించదా అన్న అనుమానమూ తలెత్తుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు