Birru Pratap Reddy: మా సత్తా ఏంటో చూపిస్తాం.. మంత్రి బుగ్గనకు సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సవాల్..! మంత్రి బుగ్గనకు తమ సత్తా ఏంటో చూపిస్తామని సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి సవాల్ చేశారు. సర్పంచుల నిధులను ప్రభుత్వం దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిధులను కరెంట్ బిల్లులకు బదలాయించామని అసెంబ్లీ సాక్షిగా బుగ్గన అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 01 May 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Birru Pratap Reddy: మంత్రి బుగ్గనకు సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి సవాలు విసిరారు. తమ సత్తా ఏంటో చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచ్ల అకౌంట్లో జమ చేయమని నిధులు కేటాయిస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభ తీర్మానం లేకుండా దొంగలించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: కాకినాడ జిల్లా గాడిమొగలో ఉద్రిక్తత.. టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు..! గత మూడు సంవత్సరాల నుండి సర్పంచులు ఆందోళన చేస్తుంటే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందిస్తూ.. అసెంబ్లీలో ఆ నిధులను కరెంట్ బిల్లులకు బదలాయించామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఇది అవాస్తవమని ఖండించారన్నారు. సర్పంచుల నిధులు దారి మళ్ళించారని నిరూపించేందుకు చర్చకు సిద్ధమా అని సవాలు విసిరానన్నారు. Also Read: వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి జోగయ్య లేఖ..! అయితే, మంత్రి బుగ్గన సమాధానం చెప్పలేక పోలీసులు, అధికారుల నుంచి తనకు నోటీసులు ఇప్పించాడని పేర్కొన్నారు. సర్పంచుల నిధులపై ఆందోళన చేయడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరానని అయితే, పోలీసులు నిరాకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తమ సవాల్ ను స్వీకరించలేదు కాబట్టి వారు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేనన్నారు. మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజలకు మీరు చేసిన దొంగతనాన్ని అన్యాయాన్ని వివరించి సర్పంచుల సంఘం సత్తా చూపిస్తామని హెచ్చరించారు. #birru-pratap-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి