Bigg Boss Season 7: యావర్ చేసిన పనికి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక

బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ 6 లెవెల్స్ లో జరగగా నిన్న చివరి లెవెల్ జరిగింది. ఇక నిన్న జరిగిన ఈ టాస్క్ లో ఆటగాళ్లు, పోటుగాళ్ళ గేమ్ చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. చివరి లెవెల్ లో ఏ టీం ఎక్కువ సార్లు గోల్ చేస్తే ఆ టీం విన్ అవుతుందని చెప్పారు. ఈ టాస్క్ లో ఆటగాళ్లు ఎక్కువ గోల్స్ వేసి పోటుగాళ్ళు పై విజయం సాధించారు. అంతే కాదు ఆ టీం సభ్యులంతా కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు.

New Update
Bigg Boss Season 7: యావర్ చేసిన పనికి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ 6 లెవెల్స్ లో జరగగా నిన్న చివరి లెవెల్ జరిగింది. ఇక నిన్న జరిగిన ఈ టాస్క్ లో ఆటగాళ్లు, పోటుగాళ్ళ గేమ్ చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. చివరి లెవెల్ లో ఏ టీం ఎక్కువ సార్లు గోల్ చేస్తే ఆ టీం విన్ అవుతుందని చెప్పారు. ఈ టాస్క్ లో ఆటగాళ్లు ఎక్కువ గోల్స్ వేసి పోటుగాళ్ళు పై విజయం సాధించారు. అంతే కాదు ఆ టీం సభ్యులంతా కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు.

పూజ, అశ్విని మాటల యుద్ధం 

కెప్టెన్సీ టాస్క్ విషయంలో పూజ, అశ్విని మధ్య పెద్ద గొడవే జరిగింది. పూజ నేను ఫీజికల్ గా స్ట్రాంగ్ నేనే ఆడతాను గేమ్ అని అంటుంది దానికి అశ్విని నిన్ను చూస్తేనే తెలుస్తుందిలే అని అనేసరికి.. అలా ఎలా అంటావ్ నన్ను అనే హక్కు నీకు లేదు, మైండ్ యువర్ టంగ్ అంటూ పూజ అశ్విని పై ఫుల్ ఫైర్ అవుతుంది. దానికి అశ్విని షట్ అప్ పెద్ద పెద్ద అరిస్తే సరిపోదు, నీ గురించి అందరికి తెలుసులే అంటూ పూజ పై ఆరోపణలు చేసింది.

publive-image

కెప్టెన్సీ కంటెండర్స్

చివరి లెవెల్ గెలిచి ఆటగాళ్లలోని సభ్యులు ప్రియాంక (Priyanka), యావర్, తేజ, శోభా, అమర్, శివాజీ (Sivaji), సందీప్, ప్రశాంత్ (Pallavi Prashanth) కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు. వీళ్ళలో కెప్టెన్ ఎవరు అనేది పోటుగాళ్ళు నిర్ణయిస్తారని బిగ్ బాస్ (Bigg Boss) చెప్తాడు. ఏడుగురు పోటీదారులు బెలూన్స్ ధరించి ఉంటారు. పోటుగాళ్లలోని సభ్యులు అక్కడ ఉన్న సూదిని తీసుకెళ్లి ఆటగాళ్లలో వాళ్ళు మద్దతు తెలిపే వ్యక్తికి ఇస్తే దాంతో అతను కంటెండర్స్ లో ఒకరి బెలూన్ బ్లాస్ట్ చేసి వారిని రేస్ నుంచి తప్పించాలి.

బిగ్ బాస్ నెక్స్ట్ కెప్టెన్ 

పోటీదారులుగా నిలిచిన ఏడుగురు సభ్యులలో అందరి బెలూన్స్ బ్లాస్ట్ అవ్వగా చివరికి తేజ, యావర్ మిగులుతారు. ఇక పోటుగాళ్లలో వీళ్ళిద్దరిలో కెప్టెన్ ఎవరని డిసైడ్ చేస్తారు. చివరిలో నయని పావని సూది తెచ్చి యావర్ ఇస్తుంది దాంతో తేజ బెలూన్ బ్లాస్ట్ చేసి యావర్ (Prince Yawar) కెప్టెన్ అయ్యాడు.

Also Read: Bigg Boss 7 Telugu Promo: నోరు అదుపులో పెట్టుకో.. నా వరకు వస్తే ఊరుకోను..!

Advertisment
Advertisment
తాజా కథనాలు