Bigg Boss 7 Telugu Promo: అంతా ఉల్టా పుల్టా.. బాటమ్ 5 సభ్యులకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్..! By Archana 15 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన "ర్యాంకింగ్ టాస్క్" హౌస్ మేట్స్ అంతా పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. 1 నుంచి 10 ర్యాంకింగ్ లో మీ.. స్థానం ఎక్కడో నిర్ణయించుకోమని చెప్పగా.. వారి ర్యాంకింగ్ కోసం ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు వాదించుకున్నారు. ఈ ర్యాంకింగ్ విషయంలో రతిక, ప్రశాంత్ ఇద్దరి మధ్య ఆర్గుమెంట్ జరిగింది. ప్రశాంత్ మాట్లాడుతూ.. "నాకు.. నా లైఫ్ లో ఎవ్వరు ఏమి చేయలేదు.. ఫస్ట్ టైం శివాజీ అన్న నన్ను.. బిగ్ బాస్ ఇంటికి ఫస్ట్ కెప్టెన్ అయ్యేలా చేశాడు.. ఒక రైతు బిడ్డగా వచ్చిన ఇక్కడికి" అంటూ పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇక రతిక.. "నువ్వు ఫస్ట్ ఫోర్ వీక్స్ ఏం గేమ్ ఆడావు.. సొంతంగా ఆడుతున్నావా..? గ్రూప్ లో ఆడుతున్నావా..?" తెలియట్లేదు అని ప్రశాంత్ తో వాదించింది. ఈ టాస్క్ లో ఇంటి సభ్యుల వాదనలు ముగిసిన తర్వాత.. బిగ్ బాస్ చెప్పినట్లు.. అందరు డిస్కస్ చేసి తీసుకున్న నిర్ణయం ప్రకారం టాప్ 5 ర్యాంకింగ్స్ లో శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభ నిల్చున్నారు. బాటమ్ 5 ర్యాంకింగ్స్ లో అమర్, గౌతమ్, అర్జున్, రతిక, అశ్విని నిల్చున్నారు. ఆ తర్వాత మొదలైంది అసలు ట్విస్ట్. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా.. కావున ఈరోజు జరగబోయే 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్క్ లో టాప్ 5 లో నిల్చున్న సభ్యులు కాకుండ.. వీక్ కంటెస్టెంట్స్ గా భావించి బాటమ్ 5 లో నిల్చున్న సభ్యులు మాత్రమే పాల్గొంటారని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంక గొడవపడి.. మరీ టాప్ 5 ర్యాంకింగ్స్ లో నిల్చున్నశివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభ మొహాలు మాడిపోయాయి. 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' కోసం బాటమ్ 5 లో ఉన్న అమర్, గౌతమ్, అర్జున్, రతిక, అశ్విని ఎంపికయ్యారని తెలిపారు బిగ్ బాస్. Also Read: Bigg Boss 7 Telugu: “గోడ మీద పిల్లిలా మాట్లాడకు”.. రతిక పై ఫైర్ అయిన అర్జున్..! #bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి