Bigg Boss 7 Telugu: "ఎవరి పొరపాట్లకు వాళ్ళే బలవుతారు".. అశ్వినికి డబుల్ ఎలిమినేషన్ షాక్..!

బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నాగార్జున ప్రశాంత్, అశ్విని ఇద్దరికీ ఈ వారం చేసిన తప్పుల గురించి గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా అశ్విని సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం పై సీరియస్ అయ్యారు.

New Update
Bigg Boss 7 Telugu: "ఎవరి పొరపాట్లకు వాళ్ళే బలవుతారు".. అశ్వినికి డబుల్ ఎలిమినేషన్ షాక్..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ కాస్త సీరియస్ గానే ఉండబోతున్నట్లు కనిపించింది. ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులు ఈ వారం టాస్క్ లో, అలాగే ఇంట్లో చేసిన తప్పుల గురించి మాట్లాడి గట్టిగానే క్లాస్ ఇచ్చారు.

publive-image

ఆ బూతులు ఏంటి ప్రశాంత్

హోస్ట్ నాగార్జున ముందుగా పల్లవి ప్రశాంత్ తో మాట్లాడారు. ఏంటీ ప్రశాంత్ దయ్యం అయిన తర్వాత ఆ బూతులు ఏంటని నాగార్జున అడగగానే ప్రశాంత్ షాకయ్యి సైలెంట్ గా నిల్చున్నాడు. దీంతో నాగార్జున.. మాట్లాడు ప్రశాంత్ నామినేషన్స్ బానే మాట్లాడతావు కదా అని కౌంటర్ ఇచ్చారు. ప్రోమో ప్రకారం అశ్విని, గౌతమ్ గురించి ప్రశాంత్ మాటాడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రశాంత్ మాట్లాడుతూ.. నేను ఫన్నీగానే అన్నాను సార్.. తప్పైతే సారీ అని కూడా చెప్పాను అని మాట్లాడాడు. ఇక నాగార్జున అందరు ఫన్నీగా ఉన్నపుడు ఇలాంటివి జోక్ గానే ఉంటాయి. కానీ వాళ్ళు హర్ట్ అయితేనే సీరియస్ అవుతాయి.. ఈ విషయంలో అశ్విని హర్ట్ అయ్యింది అని ప్రశాంత్ కు క్లాస్ ఇచ్చారు.

publive-image

కాన్ఫిడెన్సా లేదా ఓవర్ కాన్ఫిడెన్సా

ఆ తర్వాత నాగార్జున.. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో అశ్విని సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం పై అశ్వినికి గట్టిగానే క్లాస్ ఇచ్చారు. అశ్విని ఈ డబుల్ ఎలిమినేషన్ ఉందని తెలుసా అని అడిగారు. దానికి అశ్విని తెలుసు సార్ అని సమాధానమిచ్చింది. దాంతో నాగార్జున.. తెలిసి కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నావా.. కాన్ఫిడెన్సా లేదా ఓవర్ కాన్ఫిడెన్సా అని ఫైర్ అయ్యారు. ప్రోమో చివరిలో ఎవరు చేసుకున్న పొరపాట్లకు వాళ్ళే బలవుతారని చెప్పారు. ఇక నాగార్జున చెప్పిన మాటల ప్రకారం ఈ వారం అశ్విని ఎలిమినేషన్ తప్పదు అన్నట్లుగానే అనిపించింది.

publive-image

Also Read:Bigg Boss 7 Telugu: ప్రతీ సారి సెంటి మెంట్ డైలాగులు ఏందిరా.. ఏడవకు.. ఆట ఆడి చూపించు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు