Bigg Boss 7 Telugu: ఇంటి సభ్యులకు దిమ్మ తిరిగే షాక్.. రతిక, దామిని,శుభ రీ ఎంట్రీ..! ప్రోమోలో బిగ్ బాస్ ప్రేక్షకులకు, ఇంటిసభ్యులకు అదిరిపోయే షాకిచ్చాడు.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన రతిక, దామిని, శుభ శ్రీ తిరిగి మళ్ళీ బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ట్విస్ట్ తో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారింది. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లుగానే బిగ్ బాస్ ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ లు ఇస్తూ ఆటను మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు. By Archana 14 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: ప్రోమోలో బిగ్ బాస్ ప్రేక్షకులకు, ఇంటిసభ్యులకు అదిరిపోయే షాకిచ్చాడు.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన రతిక, దామిని, శుభ శ్రీ తిరిగి మళ్ళీ బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ట్విస్ట్ తో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారింది. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లుగానే బిగ్ బాస్ ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ లు ఇస్తూ ఆటను మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు. బిగ్ బాస్ లోకి మళ్ళీ అడుగుపెట్టిన రతిక, శుభ శ్రీ, దామిని నిజంగానే ఇంట్లో మళ్ళీ గేమ్ ఆడటానికి వచ్చారా లేదా బిగ్ బాస్ వాళ్ళను గెస్ట్ లుగా ఇంట్లోకి రప్పించారు అనే చర్చ మొదలైంది ప్రేక్షకులలో. ఒకవేళ వాళ్ళు ముగ్గురు ఒకేసారి ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఈ వీక్ త్రిబుల్ ఎలిమినేషన్ ఏమైనా ఉందేమో అన్నట్లుగా కూడా ప్రేక్షకులు భావిస్తున్నారు. యావర్, అమర్ తో ప్రవర్తించిన తీరు పై నాగార్జున మండిపడ్డారు. కెప్టెన్ అయ్యాక నీ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ మారిపోయినట్లు ఉన్నాయి అంటూ యావర్ ని ప్రశ్నించాడు. అలాగే యావర్ అమర్ తో ప్రవర్తించిన తీరు పై ఓ వీడియో కూడా చూపించి యావర్ పై ఫైర్ అయ్యాడు. యావర్, అమర్ మధ్య జరిగిన గొడవలో మధ్యలో వెళ్లిన సందీప్ ను కూడా తిట్టినట్లు ప్రోమోలో కనిపిస్తుంది. సందీప్ నువ్వు మధ్యలో వెళ్లి గొడవను ఇంకా పెద్దది చేశావంటూ నాగార్జున ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ ఇంట్లో దామిని, రతిక, శుభ శ్రీ ఎంట్రీ తో గేమ్ మరో లెవెల్ కు వెళ్ళబోతున్నట్లు కనిపిస్తుంది. అసలు ట్విస్ట్ ఏంటి అనేది ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ప్రోమోలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా ఏదైనా జరగొచ్చు అంటాడు. దీన్ని బట్టి ఈ వారం కూడా డబల్ లేదా త్రిబుల్ ఎలిమినేషన్ ఉందేమో అని భావిస్తున్నారు. Also Read: Bigg Boss 7 Telugu: అమర్ ఎలిమినేటెడ్..? మళ్ళీ ఒకరు సీక్రెట్ రూమ్..! #bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo #bigg-boss-7-actor-sivaji సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి