Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 2.0 గ్రాండ్ లాంచ్.. ఈ ఏడుగురి వైల్డ్ కార్డు ఎంట్రీ..

బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్నట్లు సోషల్ మీడియాలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీస్ గా రాబోతున్న సెలబ్రెటీస్ వెళ్లే..

New Update
Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 2.0 గ్రాండ్ లాంచ్.. ఈ ఏడుగురి వైల్డ్ కార్డు ఎంట్రీ..

Bigg Boss 7 Telugu:  ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. ముందు సీజన్స్ తో పోల్చుకుంటే నిర్వాహకులు ఈ సీజన్ కాస్త బిన్నంగానే ప్లాన్ చేసారు. ప్రేక్షకులలో ఉత్సాహాన్ని పెంచడానికి గేమ్ లో కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ముందుకు వెళ్తున్నారు.

అయితే ఈ సీజన్ హౌస్ మేట్స్ VS కంటెస్టెంట్స్ గా సాగుతోంది. పవర్ అస్త్రా గెలిచిన వారు మాత్రమే కన్ఫర్మ్డ్ ఇంటి సభ్యులు అవుతారంటూ మెలిక పెడతారు. పవర్ అస్త్రాను ఇప్పటికే 4 సభ్యులు సొంతం చేసుకున్నారు.

ప్రతి సీజన్ 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలవుతుంది. కానీ ఈ సీజన్ లో కేవలం 14 మంది మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే 4 వారాలు గడిచాయి. నలుగురు ఇంటి సభ్యులు వెళ్లిపోయారు ఇక మిగిలింది 10 మంది మాత్రం అందులో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు.

దాంతో బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ (Wild Card Entry) ఉండబోతుంది అంటూ ప్రేక్షకులలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గత సీజన్స్ లో ఎప్పుడు జరగనట్లుగా, ఒకేసారి 7 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: నన్ను క్షమించండి బిగ్ బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న యావర్..?

షోను మరింత ఆసక్తిగా చేయటం కోసం బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీలను ప్లాన్ చేసినట్లు బజ్ నడుస్తోంది. అసలు వైల్డ్ కార్డు ఎంట్రీ లు గా రాబోతున్న ఆ ఏడుగురు సెలబ్రేటిస్ వీళ్లే

అంజలి పవన్ (Anjali Pavan)

నీతోనే డాన్స్ షోలో నట్రాజ్ మాస్టర్ తో కాంట్రావర్సీలు క్రియేట్ చేసిన ఈ బ్యూటీ బిగ్ బాస్ నిర్వాహకుల కళ్ళు తన పై పడేలా చేసుకుంది. ఇప్పుడు ఈ బుల్లి తెర బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.

భోలే షావలి (Singer Bhole Shavali)
భోలే షావలి ఈయన ఒక సింగర్. అయన పాడిన పాటల్లో 'కష్టపడ్డా' అనే సాంగ్ యుట్యూబ్ లో కొన్ని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

అంబటి అర్జున్ (Ambati Arjun)

సీరియల్స్, షోస్ లో తరచుగా కనిపించే ఈ బుల్లితెర నటుడు కూడా వైల్డ్ కార్డు ఎంట్రీకి సిద్దమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

అలాగే యాంకర్ ప్రత్యుష, ఫర్జానా , సుప్రీత, ఈటీవీ ప్రభాకర్ (ETV Prabhakar) ఇలా పలువురు బుల్లితెర సెలబ్రేటిస్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా అడుగుపెడుతున్నారు.

అయితే ఈ వైల్డ్ కార్డు ఎంట్రీలను బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు  2.0 (Bigg Boss 7 Telugu 2.0) అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ నెలలో గ్రాండ్ లాంచ్ చేయబోతున్నట్లు చర్చలు జరుగుతున్నాయి.

Also Read: OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ధమాకా.. అదిరిపోయే సినిమాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు