A.Chandra shekhar rao:టీబీజేపీకి భారీ షాక్..పడిన మరో వికెట్..పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఏ.చంద్రశేఖర్ రావు!

బండి సంజయ్ ను అధ్యక్షుడి స్థానం నుంచి తప్పించినప్పట్నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ సీనియర్ నేత,మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ రావు మొత్తానికి తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంత బుజ్జగించినా ఫలితం లేకుండాపోయింది. కొన్నాళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్న ఆయనను.. స్వయంగా ఈటల ఇంటికెళ్ళి సముదాయించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ మేరకు వికారాబాద్ సీనియర్ నేత.. కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు.

New Update
A.Chandra shekhar rao:టీబీజేపీకి భారీ షాక్..పడిన మరో వికెట్..పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఏ.చంద్రశేఖర్ రావు!

A.Chandra shekhar rao: బండి సంజయ్ ను అధ్యక్షుడి స్థానం నుంచి తప్పించినప్పట్నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ సీనియర్ నేత,మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ రావు మొత్తానికి తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంత బుజ్జగించినా ఫలితం లేకుండాపోయింది. కొన్నాళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్న ఆయనను.. స్వయంగా ఈటల ఇంటికెళ్ళి సముదాయించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ మేరకు వికారాబాద్ సీనియర్ నేత.. కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. దీంతో బీజేపీకి భారీ షాక్ తగిలింది.అయితే బీజేపీ, బీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఏ. చంద్రశేఖర్ రావు ఆరోపించారు.

రాజీనామా లేఖలో..

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న భావన తెలంగాణ ప్రజల్లో నాటుకుపోతుందన్నారు. కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను నిలువరించలేకపోతుందని ఏ చంద్రశేఖర్ రావు టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను 12 ఏళ్లు పని చేశానని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఉద్యమం కోసం తన ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిని సైతం వదులుకున్నానని అన్నారు.కానీ, తెలంగాణ వచ్చినా, రైతుల పొలాలకు నీళ్ళు రాలేదని, యువతకు ఉద్యోగాలు రాలేదని ఆయన లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనలాంటి చాలా మంది ఉద్యమనాయకులు.. బీజేపీలో చేరి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని, పార్టీ కోసం పని చేసే నేతలను ప్రోత్సహించకపోవడం మంచిది కాదన్నారు మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ రావు.

త్వరలోనే కాంగ్రెస్ లోకి..

బండిని అధ్యక్ష పదవిని నుంచి తప్పించినప్పట్నుంచి ఏ చంద్రశేఖర్ రావు పార్టీ కార్యకలాపాలకు గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచే తీవ్ర నిరాశతో ఉన్న ఆయన పార్టీ మారాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, అధిష్టానంతో మంతనాలు కూడా జరిపారు. దీంతో ఈ నెల 18 న ఆయన ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఇక రానున్న ఎన్నికల్లో ఆయన జహీరాబాద్ లేక చేవెళ్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ ప్రస్తానం..

1985లో టీడీపీ ద్వారా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లోనే మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 1989, 1994,1999 లలో వరుసగా టీడీపీ తరపునే బరిలోకి దిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001 లో ఆయన రాజకీయ సమీకరణాలను దృష్ట్యా పార్టీ మారారు. టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. 2004 ఎన్నికల్లో మరోసారి గెలిచి.. కూటమిలో భాగంగా.. వైఎస్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం 2008 లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత వచ్చిన బైఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు.

2009 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు. అప్పుడు టీఆర్ఎస్ కు బై..బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇక 2018 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2021 లో బీజేపీలో చేరారు. అయితే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఆరోపణలు చేసిన ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికే చేరనున్నట్టు సమాచారం.

టీబీజేపీకి భారీ షాక్..

కర్ణాటక ఫలితాల కంటే ముందు తెలంగాణలో ఇక ప్రధాన ప్రతిపక్షం అంటే బీజేపీయే అన్నట్టుగా ఉండేది. కానీ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాత్రం పార్టీలో తీవ్ర గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సడెన్ గా పార్టీ అధ్యక్షుడి స్థానం నుంచి బండిని తప్పించడం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ విషయంలో పార్టీ స్టాండ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం..నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు టీబీజేపీని గాడి తప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ కు బ్రేక్ వేసే దమ్ము బీజేపీకే ఉందని పార్టీలోకి చేరిన కీలక నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారంతో పాటు నేతల మధ్య నెలకొన్న అంతర్గతవిభేదాలతో పార్టీలోని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నేత ఏ చంద్రశేఖర్ రాజీనామాతో పార్టీకి భారీ షాకే తగిలింది. ఇక త్వరలోనే మరి కొంత మంది కూడా బీజేపీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు