కోడికత్తి కేసులో సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ

విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కోడికత్తి కేసులో మరింత లోతుగా దర్యాప్తుచేయాలని జగన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను ఆగస్టు ఒకటి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

New Update
కోడికత్తి కేసులో సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ

Kodi Katti Case

ఆగస్టు ఒకటికి విచారణ వాయిదా..

కోడి కత్తి కేసులో(Kodi Katti Case) సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఎన్ఐఏ కోర్టులో షాక్ తగిలింది. ఈ కేసులో దాగి ఉన్న కుట్రకోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్‌ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అలాగే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ జైలుకి తరలించాలని నిందితుడు శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీమ్ కోరారు. NIA కేసులో నిందితులకు భద్రత కల్పించలేమని విజయవాడ జైలర్ చెప్పారు. దీంతో ప్రస్తుతానికి విజయవాడ జైలుకి తరలింపు సాధ్యంకాదని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో విశాఖ జైలుకైనా తరలించాలని కోరారు. అటు బెయిల్ కూడా ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఆగస్టు ఒకటిన విచారణ చేపడతామని తెలిపింది.

గతంలో సీజేఐకి నిందితుడు లేఖ..

గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిందితుడు శ్రీనివాస్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో నాలుగున్నర సంవత్సరాలుగా విచారణ ఖైదీగా మగ్గుతున్నాను అని ఆవేదన వ్యక్తంచేశాడు. కోడికత్తి కేసును త్వరితగతిన విచారణ చేయాలని.. లేదంటే తనకు బెయిల్‌ అయినా ఇవ్వాలని కింది కోర్టుకు పలుసార్లు విజ్ఞప్తిచేశానని పేర్కొన్నాడు. న్యాయం చేయాలని తన తల్లి కూడా అర్జీ పెట్టారని అయినా ఎలాంటి పురోగతి లేదన్నాడు. కింది కోర్టు పదేపదే తన రిమాండ్‌ కాలం పొడిగిస్తోందని వాపోయాడు. తమది పేద కుటుంబం కావడంతో పైకోర్టుల్లో అప్పీల్‌కు వెళ్లలేకపోతున్నామన్నారు. జైలులో ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నానని ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసు త్వరగా విచారణ జరిగేలా చూడాలని లేఖలో కోరారు.

2018లో జగన్‌పై కోడికత్తితో దాడి..

కాగా 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 అక్టోబర్‌ నెలలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నం చేశాడు. అప్పుడు ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. కేసును మరింత లోతుగా విచారణ చేయాలని కోరుతూ సీఎం జగన్‌ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. అయితే తొలి నుంచి విచారణ చేస్తున్న న్యాయమూర్తి బదిలీపై వెళ్లడం.. నూతన న్యాయమూర్తి రావడంతో మరోసారి పూర్తి స్థాయి వాదనలు జరుగుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు