AP: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ రిలీఫ్..ఏపీ హైకోర్టులో ఊరట.! మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు గుడివాడ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నానిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొడాలికి 41-ఏ నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. By Jyoshna Sappogula 08 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి EX Minister Kodali Nani: ఏపీలో వాలంటీర్ల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా నిలుస్తూ పలువురు వాలంటీర్లు (Volunteers) రాజీనామా చేశారు. అయితే, ఎన్నికల అనంతరం తాము ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదని తమతో బలవంతంగా రాజీనామా చేయించారని మాజీ మంత్రి కొడాలి నానినిపై వాలంటీర్లు గుడివాడలో ఫిర్యాదు చేశారు. Also Read: నోరు పారేసుకోకు.. నెక్ట్స్ జైలుకు వెళ్లేది నువ్వే: ఎమ్మెల్యే సోమిరెడ్డి తాజాగా, మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో (AP High Court) ఊరట లభించింది. ఈ కేసులో నానిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొడాలికి 41-ఏ నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. విచారణలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. #kodali-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి