BIG BREAKING: బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చిన సీఎం కేసీఆర్ అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడు విజేయుడికి బీఆర్ఎస్ బీఫామ్ అందించారు సీఎం కేసీఆర్. By V.J Reddy 07 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections: బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి విజేయుడికి బీఆర్ఎస్ బీఫామ్ అందించారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే 119 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. గతంలో 110 మందికి బీఫామ్ లు అందించారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మిగతా 9 మందికి బీఫామ్ లు అందించారు. Also Read: రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్! అలంపూర్ టికెట్ విషయంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తన మాట నెగ్గించుకున్నారు. ప్రస్తుతం అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను ఈ ఎన్నికల బరి నుంచి తొలిగించి తన అనుచరుడైన విజేయుడికి టికెట్ ఇప్పించుకున్నారు. ప్రస్తుత అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగితున్న విజయుడిని గెలిపించే పూర్తి బాధ్యత ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తీసుకోవాలని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. అలంపూర్ టికెట్ మార్పుతో మరోసారి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి సెగలు ఆజ్యం పోసుకోనున్నట్లు తెలుస్తోంది. Also Read: బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు కేటీఆర్ బీఫామ్ లు ఇచ్చిన 9 స్థానాల అభ్యర్థులు వీరే.. 1. చాంద్రాయణ గుట్ట -ఎం.సీతారాం రెడ్డి 2. యాకత్ పురా – సామా సుందర్ రెడ్డి 3. బహుదూర్ పుర – ఇనాయత్ అలీ బక్రీ 4. మలక్ పేట- తీగల అజిత్ రెడ్డి 5. కార్వాన్ – అయిందాల కృష్ణ 6. చార్మినార్ – సలావుద్దీన్ లోడి 7. నాంపల్లి – సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ 8. గోషామహాల్ – నంద కిషోర్ వ్యాస్ 9. అలంపూర్ – విజేయుడు #cm-kcr #telanagana-elections #brs-mla-candidate మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి