Bhuvaneshwari : భువనేశ్వరి కాన్వాయ్‌ అడ్డుకున్న పోలీసులు

పీలేరులో నారా భువనేశ్వరి కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. నిజం గెలవాలి కార్యక్రమానికి వచ్చిన భువనేశ్వరిని కోడ్ అమలులో ఉందంటూ నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతించారు. భువనేశ్వరి వాహనాన్ని నిలిపేసినా పీలేరు నాయకత్వం స్పందించని పరిస్థితి కనిపిస్తోంది.

New Update
Bhuvaneshwari : భువనేశ్వరి కాన్వాయ్‌ అడ్డుకున్న పోలీసులు

Bhuvaneshwari: పీలేరులో టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజం గెలవాలి కార్యక్రమానికి వచ్చారు నారా భువనేశ్వరి. తిరుపతి ఏయిర్ పోర్ట్ నుంచి వాహన శ్రేణి ఆమె వెంట బయలుదేరింది. అయితే, పీలేరు వద్ద భువనేశ్వరి కాన్యాయి వాహనాలను పోలీస్ అధికారులు అడ్డుకున్నారు.

Also Read: పిఠాపురంలో పవన్ కు షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఇంఛార్జి శేషుకుమారి

భువనేశ్వరి వాహనాన్ని నిలిపేసినా పీలేరు నాయకత్వం ఏ మాత్రం స్పందించలేదు. దీంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శైలిపై టీడీపీ వర్గీయులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పీలేరులో ఎన్నికల కోడ్ పేరిట పెద్దిరెడ్డి సుధీర్ హవా చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి కోసం పోలీసు అధికారులు పనిచేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.

Also Read: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లుపై కేసు నమోదు

కోడ్ అమలులో ఉందంటూ నాలుగు వాహనాలు మాత్రమే అనుమతించారు. ఐదు నిమిషాలకు రెండు వాహనాల చొప్పున పంపుతామని పోలీసులు తెలిపారు. మీడియా వాహనాన్ని సైతం కాన్వాయ్ వెంట పంపలేదని తెలుస్తోంది. భూవనేశ్వరి పిఏ వాహనాన్ని కూడా అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున వాహనాలను అనుమతించలేదని తెలిపారు పీలేరు పోలీసులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు