Chandrababu: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా?: బ్రాహ్మణి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజమండ్రిలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక మహిళలతో కలిసి రాజమండ్రి తిలక్‌ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్‌ రామాలయం జంక్షన్‌ వరకూ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.

New Update
Chandrababu: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా?: బ్రాహ్మణి

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజమండ్రిలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక మహిళలతో కలిసి రాజమండ్రి తిలక్‌ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్‌ రామాలయం జంక్షన్‌ వరకూ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. వివిధ మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము ఎప్పుడూ ఊహించలేదని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారని.. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారని వాపోయారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే ఆయన చేసిన నేరమా? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టును దేశమంతా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. ఆయన త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు బ్రాహ్మణి.

మరోపైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మేము సైతం అంటూ రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు టీడీపీ శ్రేణులు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని అధికార పార్టీ వైసీపీని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన త్వరగా జైలు నుండి విడుదల కావాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.16 నెలలు జైల్లో ఉన్న జగన్ తన శాడిజంతో చంద్రబాబును జైలుకు పంపారని మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తుల ప్రక‌ట‌న త‌ర్వాత సీఎం జగన్‌కు, వైసీపీ మంత్రుల‌కు భ‌యం ప‌ట్టుకుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దెవా చేశారు. ప‌వ‌న్ పొత్తుల ప్రకట‌న త‌ర్వాత వైసీపీ నేత‌లు నిద్రలేని రాత్రులు గ‌డుపుతున్నారని చురకలు వేశారు.

ఇది కూడా చదవండి: సైకో జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపిస్తాం.. నారా లోకేష్ సంచలన కామెంట్స్..

చంద్రబాబును విడుదల చేయాలంటూ అభిమానుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులు సైతం చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రోడెక్కారు. ఇప్పటికే హైదరాబాద్‌ హైటెక్ సిటీలో నిరసన తెలిపిన ఉద్యోగులు ఔటర్ రింగ్ రోడ్డుపై కార్ల ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో ఓఆర్ఆర్‌ వద్ద టెన్షన్‌ వాతవారణం నెలకొంది. యామ్ విత్ సీబీఎన్‌ (I Am With CBN) అంటూ నినాదాలు చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఐటీ ఉద్యోగుల ర్యాలీకి పర్మిషన్‌ లేదంటున్నారు పోలీసులు. ఈ నేపత్యంలో ORRపై కార్ల తనిఖీలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: టీడీపీ-జనసేన పొత్తు లాభమా…నష్టమా…ఎవరి వాటా ఎంత?

Advertisment
Advertisment
తాజా కథనాలు