వైసీపీ నాయకులకు భూమా అఖిల ప్రియ సవాల్.! వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. రైతుల ఓట్లు కావాలి కానీ, రైతుల సమస్యలు మాత్రం పట్టవని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సాగునీటిపై అవగాహన లేదని మాట్లాడుతున్న నాయకులు తనతో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 14 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Bhuma Akhil Priya: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులకు రైతుల ఓట్లు కావాలి కానీ, రైతుల సమస్యలు మాత్రం పట్టవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో నీరు ఉన్నప్పట్టికి పంట పొలాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సాగు నీటి కోసం పోరాటం చేయాలని రైతులు తన ఇంటి తలుపులు తడుతున్నారని..అందుకే నీరు కావాలని రోడ్డు ఎక్కినట్లు తెలిపారు. Also read: ఆ స్కీం లో రూ.120 కోట్లు మాయం.. జగన్ సర్కార్ పై నాదెండ్ల సంచలన ఆరోపణలు నంద్యాల జిల్లాలో సాగునీటి సమస్య తీర్చాలని కలెక్టర్ కు విన్నవించామని తెలిపారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. కాలువ గట్టుపైకి వెళ్లి పరిశీలిస్తేనే.. నాలుగు రోజులు నీళ్ళు వదులుతున్నారని మండిపడుతున్నారు. పంట పొలాలకు ఎందుకు నీరు వదలడం లేదని ప్రశ్నించారు. నీళ్ళకోసం రైతులు కొట్లాడుకునే పరిస్థితులను అధికార పార్టీ నాయకులు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. గంగుల ప్రభాకర్ రెడ్డి సాగునీటి సలహాదారుగా ఉండి రైతు సమస్యల పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులకు బహిరంగా సవాల్ విసిరారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. సాగునీటిపై అవగాహన లేదని మాట్లాడుతున్న నాయకులు తనతో చర్చకు సిద్దమా అంటూ ఛాలెంజ్ విసిరారు. నిద్ర మత్తులో ఉన్న ప్రభుత్వం మేల్కొవాలి.. పంట పొలాలకు నీళ్ళు వచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీమలో రైతు సమస్యల పై మాట్లడే నాయకులు ఒక్కరు కూడా లేరని ధుయ్యబట్టారు. రైతుల అత్మహత్యలు చూడాల్సి వస్తూందమో అని భయంగా ఉందని పేర్కొన్నారు. పది రోజుల పాటు చివరి ఆయకట్టు రైతులకు నీళ్ళు అందించాలని కోరారు. రైతులకు న్యాయం జరగకపోతే రైతు సంఘాలను కలుపుకొని రైతులతో కలిసి ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. #ex-minister-bhuma-akhilapriya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి