ఆ విషయంలో దళిత బంధు ఆదర్శంగా నిలుస్తుంది.... భీమ్ ఆర్మీ చీఫ్ ట్వీట్...!

సీఎం కేసీఆర్‌ను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ జూలై 29న కలిశారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ తో భేటీలో పలు అంశాల గురించి చర్చించినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటం, త్యాగాల గురించి తెలుసుకున్నట్టు చెప్పారు.

New Update
ఆ విషయంలో దళిత బంధు ఆదర్శంగా నిలుస్తుంది.... భీమ్ ఆర్మీ చీఫ్ ట్వీట్...!

సీఎం కేసీఆర్‌ను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ జూలై 29న కలిశారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ తో భేటీలో పలు అంశాల గురించి చర్చించినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటం, త్యాగాల గురించి తెలుసుకున్నట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా వున్న దళిత సాధికారతపై కేసీఆర్ తన ఆలోచనలు, భావాలను పంచుకున్నారని ట్వీట్ లో వెల్లడించారు.

దళితుల సాధికారత విషయంలో దళిత బంధు ఎలా ఆదర్శంగా నిలుస్తోందో సీఎం కేసీఆర్ వివరించారని చెప్పారు. ఇది ఇలా వుంటే సీఎం కేసీఆర్ ను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ జూలై 28న ప్రగతి భవన్ లో కలిశారు. అనంతరం ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా దేశంలో దళితుల పరిస్థితి, దళితుల పట్ల పాలకులు అనుసరిస్తున్న వైఖరి, కులం పేరిట ప్రజా విభజన, సామాజిక వివక్ష, ఆహార నియమాల పేరిట దళితుల పై జరుగుతున్న దమనకాండ గురించి చర్చించారు.

అనంతరం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ..... దళితుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న దళిత బంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక వివక్ష నుంచి ఆత్మ గౌరవం దిశగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉందని కొనియాడారు. ఇది యావత్ దళిత జాతి గర్వించదగ్గ సందర్భమన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిగడ్డ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారన్నారు. ఇది అంబేద్కర్ పట్ల సీఎం కేసీఆర్ కు ఉన్న అభిమానానికి, అంబేడ్కర్ ఆశయాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అదే విధంగా రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించడం దేశ చరిత్రలోనే మొదటి సారి అని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు