Mother's Day: మదర్స్ డే రోజున మీ అమ్మతో కలిసి ఈ ప్రదేశాలకు వెకేషన్ వెళ్ళండి..? సూపర్ గా ఎంజాయ్ చేస్తారు ప్రతీ సంవత్సరం మే నెల రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 12న మదర్స్ డే. ఈ స్పెషల్ డే రోజున మీ అమ్మను సర్ప్రైజ్ చేయడానికి ఈ అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్లండి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 08 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Mother's Day: జీవితంలో ప్రతీ రోజు అమ్మను ప్రేమిస్తాము. అయినప్పటికీ సంవత్సరంలో ఒక రోజు మాత్రం అమ్మలకు ప్రత్యేకంగా కేటాయించబడింది. ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 12న మదర్స్ డే. ఈ రోజు జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం తల్లిని గౌరవించడమే. ఈ రోజున, పిల్లలు తమ తల్లికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే మీ అమ్మకు ట్రావెలింగ్ , పుణ్యక్షేత్రాలు అంటే బాగా ఇష్టమున్నట్లయితే.. వారిని సర్ప్రైజ్ చేయడానికి ఈ అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్లండి. ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. డార్జిలింగ్ మీ అమ్మను రిలాక్సింగ్ ట్రిప్‌కి తీసుకెళ్లాలనుకుంటే, ప్రశాంతమైన అందమైన డార్జిలింగ్‌కు వెళ్లండి. ఇక్కడ మీరు టీ తోటల పర్యటన మంచి అనుభూతిని అందిస్తుంది. ఇది కాకుండా, హిమాలయాల అందమైన దృశ్యాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ అమ్మతో కలిసి ఇక్కడ టాయ్ ట్రైన్‌ను కూడా ఆస్వాదించండి. మైసూర్ కర్ణాటకలోని హిల్ స్టేషన్ ఒక గొప్ప గమ్యస్థానం. ఈ ప్రదేశం దాని చరిత్ర అద్భుతమైన రాజభవనాలకు ప్రసిద్ధి చెందింది. మీ తల్లితో కలిసి ఇక్కడ మైసూర్ ప్యాలెస్‌ని అన్వేషించండి. ఈ ప్యాలెస్ గురించి తెలుసుకోవడంలో వాళ్ళు ఆసక్తిగా కూడా ఉంటారు. ఇది కాకుండా, ఇక్కడ స్థానిక ఆహారాన్ని ఖచ్చితంగా రుచి చూడండి. ఉదయపూర్ మీ అమ్మతో కలిసి అద్భుతమైన సరస్సులు కలిగిన ఈ నగరాన్ని సందర్శించండి. సరస్సుపై పడవ ప్రయాణం చేయడం నుంచి సిటీ ప్యాలెస్, జగదీష్ ఆలయాన్ని సందర్శించడం వరకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇవే కాకుండా ఉదయపూర్‌లో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. మీ అమ్మతో కలిసి ఇక్కడి మార్కెట్‌ను అన్వేషించవచ్చు. వారు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. నైనిటాల్ నైనిటాల్ కూడా చాలా అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ మీరు సహజ సౌందర్యాన్ని అన్వేషించవచ్చు. ఢిల్లీకి ఈ ప్రదేశం చాలా దగ్గరగా ఉంటుంది. మదర్స్ డే వేడుకలకు ఇది ఉత్తమమైన ప్రదేశం. Also Read: Baby Care : వేసవిలో పిల్లల చర్మం పై వేడి దద్దుర్లు ఎందుకు వస్తాయి.? తప్పక తెలుసుకోండి..! #mothers-day మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి