Bathukamma Song: బతుకమ్మ పాట పాడిన కవిత..! తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే పండగ బతుకమ్మ. తెలంగాణ ప్రజలు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండగ అంటేనే సింగర్స్ బతుకమ్మ పాటలతో దుమ్మురేపుతారు. ఇక ఈ సంవత్సరం M.L.C కవిత కూడా మైక్ పట్టుకొని బతుకమ్మ పాట పాడుతూ సందడి చేసింది. By Archana 18 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bathukamma Song By Kavitha: తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే పండగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు ఆడుతూ, పాడుతూ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. M.L.C కవిత మహిళలతో కలిసి ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. ఇక ఈ సంవత్సరం ప్రత్యేకంగా కవిత బతుకమ్మ పాట పాడుతూ సందడి చేసింది. ప్రతి సంవత్సరం M.L.C కవిత (Kavitha) బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. భారత జాగృతి (Bharat Jagruthi) అధ్యక్షురాలిగా తెలంగాణ సంస్కృతిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆడవాళ్ళతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఆడి పాడి సందడి చేస్తారు కవిత. ఇక సంవత్సరం M.L.C కవిత తన గొంతు వినిపిస్తూ.. బతుకమ్మ పాటతో సందడి చేసింది. బతుకమ్మ కోసం తయారు చేసిన 'మంచు మొగ్గలై మల్లెపొదల పూల ఏరుల్లో మనసందామావయ్య.. అవనిపై గౌరీదేవి బతుకమ్మై వెలసిందో ఓ సందామావయ్యా..' అనే ఈ పాటలో కవిత కూడా తన గొంతును కలిపారు ఈ పాటలో 'ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ' అని పాడుతూ అందరిని ఆకట్టుకున్నారు. ఈ పాటకు సంబందించిన వీడియో యుట్యూబ్ లో విడుదలైంది. ఈ పాటలో కవిత తన గొంతు కలపడంతో పాటు అందరితో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ పాటలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చక్కగా చూపించారు. ఈ పాట చూసిన నెటిజన్లు చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కవిత పాడటం పై కూడా నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. Also Read: Prabhas: ప్రభాస్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ మిస్సింగ్.. హ్యాక్ అయ్యిందా..? డియాక్టివేట్ చేశారా..? #bathukamma-2023 #bathukamma-songs #talangana #bathukamma-song-by-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి