చరిత్ర తిరగరాస్తా.. మళ్లీ గెలుస్తా ఇల్లందు నియోజకవర్గంలో చరిత్ర తిరగరాస్తానని.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ సవాల్ చేశారు. చిన్న చిన్న అసంతృప్తులు మినహా నియోజకవర్గంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పార్టీ నిర్ణయానికి నాయకులంతా కట్టుబడి ఉంటారని తెలిపారు. పార్టీని ఎదిరించిన వారిని పార్టీ పెద్దలు చూసుకుంటారని హెచ్చరికలు చేశారు. By Sadasiva 11 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఇల్లందు నియోజకవర్గంలో చరిత్ర తిరగరాస్తానని.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ సవాల్ చేశారు. బుధవారం ఆమె ఆర్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ ఆశీస్సులు తనకు వున్నాయని, తనకే బీఫామ్ వస్తుందని.. గెలిచేది కూడా తానేనని కుండబద్దలు కొట్టారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీనే ఆదరిస్తారని తెలిపారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ఇల్లందు రూపురేఖలు మార్చా.. ఇల్లందరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించిన దగ్గరి నుంచి అందరు నేతలనూ కలుస్తున్నానని తెలిపారు. ఆదివాసీ గూడెల్లో, తండాల్లోకి వెళ్లి స్థానిక నాయకులు, ప్రజలతో మాట్లాడుతున్నానని... వారంతా తనకే ఓటు వేస్తామని మాట ఇచ్చారన్నారు. ఆదివాసీలు, తండా ప్రజలు మాట ఇస్తే తప్పరని స్పష్టం చేశారు. కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్మానాలు కూడా చేస్తామని ప్రజలు చెబుతున్నారని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని అని గ్రామాలు, తండాల్లో రూ.80 కోట్లతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. గృహలక్ష్మి, దళితబంధు పథకాల ద్వారా ఎన్నో కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. వేలాది కుటుంబాలకు పోడు పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని హరిప్రియ తెలిపారు. దాదాపు 18వేల మందికి పోడు పట్టాల ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు. నియోజకవర్గంలో 6 దశాబ్దాలుగా తిష్ట వేసిన సమస్యలను తాను పరిష్కరించానని తెలిపారు. గత 60, 70 సంవత్సరాలుగా మారని ఇల్లందు పట్టణ పరిస్థితులు గత మూడేళ్లలో మారాయన్నారు. ఇల్లందుకు బస్టాండ్ తీసుకొచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని ఎదిరిస్తే అంతే.. చిన్న చిన్న అసంతృప్తులు మినహా నియోజకవర్గంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పార్టీ నిర్ణయానికి నాయకులంతా కట్టుబడి ఉంటారని తెలిపారు. అసమ్మతి నేతలందరితోనూ తాను మాట్లాడతానన్నారు. తనతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా మాట్లాడుతున్నారని తెలిపారు. నేతలందరినీ కలుపుకుని వెళతామని హరిప్రియ తెలిపారు. ఇల్లందులో నాయకులకు స్వేచ్ఛ ఎక్కువని.. తనను కొందరు వద్దనడానికి ఆ స్వేచ్ఛే కారణమన్నారు. అగ్ర కుల నాయకులు ఇల్లందులో రాజకీయం చేస్తున్నారన్నది ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు. పార్టీని ఎదిరించిన వారిని పార్టీ పెద్దలు చూసుకుంటారని హెచ్చరికలు చేశారు. నా గెలుపులో కోరం కనకయ్య లేడని, కోరం కనకయ్య గెలుపులో హరిప్రియ ఉందన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి