శరన్నవరాత్రులకు ముస్తాబవుతున్న భద్రాచలం! మరో రెండు రోజుల్లో దేవి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ సంబరాలు ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని భద్రాచలం రాముల వారి ఆలయం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. By Bhavana 13 Oct 2023 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి మరో రెండు రోజుల్లో దేవి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ సంబరాలు ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని భద్రాచలం రాముల వారి ఆలయం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. ఈ 9 రోజుల పాటు ఆలయంలోని శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు రోజుకి ఒక అలంకారంలో భక్తులకు దర్శనమివవ్వనున్నారు. 24 వ తారీఖున వియజ దశమి రోజున నిజరూప లక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అదే రోజు సాయంత్రం శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీలా మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమావేవి వివరించారు.ఆశ్వయుజ శుద్ద పూర్ణిమ సందర్భంగా శబరి స్మృతి యాత్ర ఉత్సవం అక్టోబర్ 28 వ తేదీన ఘనంగా నిర్వహించనున్న ఆమె వివరించారు. Also read: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ..కాలికి 12 కుట్లు! అలాగే అక్టోబర్ 28 వ తేదీన పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి స్వామి వారి ఆలయాన్ని మూసివేసి తిరిగి తెల్లవారు జామున 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ది కార్యక్రమాలు పూర్తి చేసి భక్తులకు దర్శనం ఇవ్వడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశ ఉత్సవాలు ప్రారంభించనున్నట్లు వివరించారు. 13 డిసెంబర్ 2023 నుండి 2 జనవరి 2024 వరకు శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం లో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయన ఉత్సవాలు జరగనున్నట్లు, డిసెంబర్ 22 సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తామని ఆలయాధికారులు తెలిపారు. డిసెంబర్ 23 తెల్లవారు జామున వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు.. #sarannavaratri #dussera మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి