Ayodhya Rama Mandir Updates: అయోధ్య రామ మందిర ప్రతిష్టకు ప్రభాస్-చిరంజీవిలకు ఇన్విటేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రతిష్టాపన కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపిస్తున్నారు. జనవరి 22న జరిగే ఈ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ లో పాల్గోవడానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ లకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. By KVD Varma 26 Dec 2023 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి Ayodhya Rama Mandir Updates: అయోధ్య రామాలయం ప్రతిష్టాపన కార్యక్రమం. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆరాటంగా.. ఎదురుచూస్తున్న ఘట్టం. వందల ఏళ్లుగా అయోధ్యలో రామాలయం కావాలని కోరుకున్న కోట్లాదిమంది భారతీయుల కల నెరవేరే రోజు. అయోధ్యలో రామాలయ దర్శనం కోసం వెళ్లాలని ఎందరో పరితపిస్తున్నారు. దాదాపుగా రామ మందిర నిర్మాణ పనులు పూర్తి అయిపోయాయి. శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం ఖరారు అయిపోయిన విషయం తెలిసిందే. జనవరి 22వ తేదీన రామ మందిరంలో రామచంద్రమూర్తి కొలువవుతారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఆరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విగ్రహ ప్రతిష్ట(Ayodhya Rama Mandir Updates) జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో చూపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కార్యక్రమాలు జనవరి 16 నుంచే ప్రారంభం అవుతాయి. జనవరి 22వ తేదీ మృగశిర నక్షత్ర సుముహూర్తంలో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. అట్టహాసంగా.. అత్యంత అద్భుతంగా జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట(Ayodhya Rama Mandir Updates) ఉత్సవాల కోసం అతిథులను ఆహ్వానించడం మొదలైంది. దేశ విదేశాల ప్రముఖులను వేడుక కోసం ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. టాలీవుడ్ నుంచి మొదటి ఆహ్వానం మెగాస్టార్ చిరంజీవికి అందినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రెండో ఆహ్వానం రెబల్ స్టార్ ప్రభాస్ కు అందినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఈ హీరోలిద్దరికీ ఆహ్వానాలు అందినట్లు తెలియడంతో ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే సలార్ హిట్ తో జోష్ మీద ఉన్న అభిమానులు ప్రభాస్ కి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలిసి సంబరపడిపోతున్నారు. ఇక బాలీవుడ్ నుంచి రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, అజయ్ దేవ్‌గణ్, సన్నీ దేవోల్, యశ్ సహా పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. Also Read: సంక్రాంతి సినిమా పంచాయతీ.. ఈసారి తగ్గేది ఎవరో.. నెగ్గేది ఎవరో? ఇదిలా ఉండగా జనవరి 22 నుంచి ప్రారంభమయ్యే రామమందిర ప్రారంభోత్సవం(Ayodhya Rama Mandir Updates) కోసం అయోధ్యకు 1,000 కంటే ఎక్కువ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. జనవరి 23న ప్రారంభమయ్యే ఈ ఆలయం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు - కోల్‌కతాతో సహా ప్రధాన నగరాలకు అనుసంధానించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామమందిర దర్శనానికి రోజుకు 50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం అయోధ్య స్టేషన్‌ని సందర్శకుల రద్దీని నిర్వహించడానికి వీలుగా పునరుద్ధరించారు. అంతేకాకుండా.. భక్తులు పవిత్ర సరయూ నదిపై ఎలక్ట్రిక్ కాటమరాన్‌పై ప్రయాణించి ఆనందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో(Ayodhya Rama Mandir Updates) విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని సంప్రదాయాలకు చెందిన 400 మంది సాధువుగాల్కు ఆహ్వానాలు పంపినట్లు ట్రస్ట్ తెలిపింది. అలాగే ఈ ప్రారంభోత్సవ సంబరాల కోసం అక్కడ తీర్థ క్షేత్రపురం నిర్మిస్తున్నట్లు చెప్పారు ట్రస్ట్ ప్రతినిధులు. దీనిలో ఆరు గొట్టపు బావులు, ఆరు వంటశాలలతో పాటు, ఓ పది పడకల ఆస్పత్రి, అందులో 150 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచినట్లు వారు వివరించారు. ఈ డాక్టర్లను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రప్పిస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. అలాగే రామమందిరం ప్రారంభానికి వచ్చే లక్షలాది భక్తులకు భోజన ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నట్లు వెల్లడించింది. Watch this interesting Video: #ayodhya-ram-mandir #ayodhya-ram-temple-inauguration మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి