Ayodhya Ram Mandir : అయోధ్య రాముల వారికి రోజుకి ఆరుసార్లు హారతి : ట్రస్ట్! అయోధ్య లో కొలువై ఉన్న బాల రామునికి ఇక నుంచి రోజుకు ఆరుసార్లు హారతి ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్టు వివరించింది. స్వామి వారికి నైవేధ్యం కింద పూరీ, కూర, స్వీట్ సమర్పించనున్నట్లు తెలిపారు. By Bhavana 24 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ayodhya : అయోధ్య రామ మందిర(Ayodhya) ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో యావత్ ప్రపంచానికి తెలిసిందే. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని, కొలువైన బాల రామున్ని చూసి యావత్ ప్రపంచంలోని హిందువులంతా పులకించిపోయారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి ప్రముఖులు అయోధ్యకు చేరుకుని కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ క్రమంలో అయోధ్య కొలువై ఉన్న బాల రాముడిని ఇప్పటి వరకు రామ్ లల్లా(Ram Lalla) అని పిలవగా ఇక నుంచి ఆ పేరును మార్చుతున్నట్లు అయోధ్య ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఇక నుంచి రామ్ లల్లాను '' బాలక్ రామ్''(Balak Ram) గా పిలవనున్నట్లు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వివరించారు. అయోధ్య రామ మందిరంలో కొలువైన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని ..అందుకే రామ్ లల్లా ను బాలక్ రామ్ అనే పేరును నిర్ణయించామని వారు వివరించారు. ఇక నుంచి ఆలయాన్ని కూడా బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు. స్వామి వారికి రోజుకు ఆరుసార్లు హారతి... మరోపక్క స్వామి వారికి రోజుకు ఆరుసార్లు హారతి కార్యక్రమాన్ని ఇవ్వనున్నట్లు ట్రస్ట్ పూజారులు వివరించారు. మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్యా, శయన హారతి ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే స్వామివారికి నిత్యం సమర్పించే నైవేథ్యం గురించి కూడా వారు వివరించారు. నైవేధ్యంలో పూరీ, కూర.. స్వామి వారికి సమర్పించే నైవేధ్యంలో(Prasad) పూరీ, కూర తో పాటు పాలు, పండ్లు, రబ్ డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లను నైవేధ్యంగా సమర్పిస్తామని తెలిపారు. మంగళవారం నుంచి రాముల వారిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజలను అనుమతించారు.దీంతో, ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన రామ భక్తులతో కిటకిటలాడుతోంది. Also read: ఇవే నా చివరి ఎన్నికలు..మాజీ మంత్రి సంచలన ప్రకటన! #ayodhya-ram-mandir #ram-lalla #balak-ram #prasad #harathi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి