
M. Umakanth Rao
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడానికి తిరస్కరించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల దృష్ట్యా పదవి నుంచి దిగిపోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్ప తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు.కేంద్ర నాయకత్వం ఆదేశించినప్పుడే ఈ చర్య తీసుకుంటానని మణిపూర్ ప్రజలు తనను ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాజీనామా చేయాలని తనను పార్టీ కోరలేదన్నారు.రాష్ట్రంలో అశాంతికి అక్రమంగా వస్తున్న శరణార్థులు,మాదక ద్రవ్యాలను దొంగరవాణా చేస్తున్న స్మగ్లర్లే కారణమని ఆయన అన్నారు.గత మూడు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.
విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ 2019 లోనే జోస్యం చెప్పారు. నాడు తన ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టినప్పుడు 2023 లో కూడా ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రభుత్వ వర్గాలు ఆ నాటి ఆయన ప్రసంగాన్ని మళ్ళీ బుధవారం గుర్తుకు తెచ్చాయి. మణిపూర్ అంశంపై మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆయన ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.
తెలంగాణలో ఆహార భద్రత, నాణ్యత ఘోరంగా ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. హ్యూమన్ రిసోర్సెస్ లోను, ఫుడ్ టెస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లోను, ట్రెయినింగ్ కెపాసిటీ బిల్డింగ్, కన్స్యూమర్ ఎంపవర్ మెంట్, ఎస్ఎఫ్ఎస్ఐ ఇంప్రూవ్ మెంట్ వంటి అంశాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని ఫుడ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది.
ప్రతిపక్షాల కూటమి ' ఇండియా' .. బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేకి షాకివ్వనుందా ? కాంగ్రెస్ ఆధ్వర్యం లోని 26 విపక్షాలతో కూడిన ఈ 'గ్రాండ్ అలయెన్స్' 2024 లోక్ సభ ఎన్నికల్లో కమలనాథులను 'ఇబ్బంది' పెట్టనుందా ? ప్రధాని మోడీ ప్రభుత్వానికి పెను సవాలుగా మారనుందా ? ఏబీపీ సి-ఓటర్ సర్వేలో తేలిన ఫలితాలు కాస్త అటూ ఇటూగా అవుననే అంటున్నాయి.
/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)