స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వాఘా సరిహద్దు వద్ద రీట్రీట్ వేడుక

ఇండియా - పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి, స్నేహ భావాన్ని పెంపొందించేలా రెండు దేశాల మధ్య ఉండే వాఘా సరిహద్దు దగ్గర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. పంజాబ్.. అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దు ఈ కారణంగా చాలా ఫేమస్ అయ్యింది.

New Update
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వాఘా సరిహద్దు వద్ద రీట్రీట్ వేడుక

Attari-Wagah Border Beating Retreat Ceremony: ఇండియా - పాకిస్థాన్ (India - Pakistan) దేశాల మధ్య శాంతి, స్నేహ భావాన్ని పెంపొందించేలా రెండు దేశాల మధ్య ఉండే వాఘా సరిహద్దు దగ్గర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day Celebrations) జరపడం ఆనవాయితీగా వస్తోంది. పంజాబ్.. అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దు ఈ కారణంగా చాలా ఫేమస్ అయ్యింది. సూర్యాస్తమయం సమయంలో రెండు దేశాల ఉమ్మడి సరిహద్దు మార్గం అయిన ఈ చెక్ పోస్ట్‌ను మూసివేసే ముందు BSF, పాకిస్తాన్ రేంజర్స్ కవాతు నిర్వహిస్తారు. దీంతో ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఇరు దేశాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుంటారు. భారత్ మాతాకీ జై.. జై జవాన్.. అనే నినాదాలు చేస్తూ భారత సైనికులను ప్రజలు ఉత్సాహపరుస్తున్నారు.

బీటింగ్ రీట్రీట్ ఆనవాయితీ 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో మొదలైంది. అప్పటి కింగ్ జేమ్స్-II ఆదేశాల మేరకు దీన్ని నిర్వహించారు. అప్పట్లో ఈ కార్యక్రమాన్ని 'వాచ్ సెట్టింగ్'గా పిలిచేవారు. సూర్యాస్తమయ సమయంలో తుపాకీతో సింగిల్ రౌండ్ కాల్పులతో ఈ వేడుకను ప్రారంభించేవారు. ప్రస్తుతం ఇండియాతో పాటు అమెరికా, కెనడా, యూకే, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.

Also Read: చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ.. సూర్యుడే టార్గెట్

Advertisment
Advertisment
తాజా కథనాలు