Kodali Nani: రాళ్లు, కోడి గుడ్లతో కొడాలి నానిపై దాడి

AP: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చేసిన సవాల్‌ను స్వీకరించాలని తెలుగు యువత నాని ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. నానిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.

New Update
Kodali Nani: రాళ్లు, కోడి గుడ్లతో కొడాలి నానిపై దాడి

Attack On Kodali Nani: మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు తెలుగు యువత ప్రయత్నం చేశారు. ఓడిపోతే రాజకీయ సన్యాయం తీసుంటానన్న మాట నాని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొడాలి ఇంటికి వెళ్తున్న తెలుగు యువతను పోలీసులు అడ్డుకున్నారు. ఒకరినొకరం కాల్చేసుకుందామని వన్‌ టౌన్‌ CI సీఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. కాగా అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. పోలీస్ వ్యాఖ్యలపై పొట్లూరి దర్శిత్ మండిపడ్డారు. కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరారు టీడీపీ శ్రేణులు. జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి దగ్గర టపాసులు కాల్చారు తెలుగు యువత. గుడివాడలో కొడాలి నానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది..ఇది ట్రైలర్ మాత్రమే అని దర్శిత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారం లేకుంటే నాని బతుకు కుక్కలు చింపిన విస్తరి అని అన్నారు. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం..దమ్ముంటే బయటకు రావాలంటూ నానికి సవాల్ విసిరారు.

Also Read: పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. ఒక సునామీ.. మోదీ పవర్ ఫుల్ డైలాగ్స్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు