ఉయ్యూరులో దారుణం.. భార్యను కత్తితో పొడిచిన భర్త కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యూరులో దారుణం చోటు చేసుకుంది. నాగమణిపై ఆమె భర్త కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో వివాహితకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. By Karthik 02 Aug 2023 in క్రైం New Update షేర్ చేయండి భార్యభర్తల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో కోపంతో ఊగిపోయిన నాగశివ తన భార్య నాగమణిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యూరులో చోటు చేసుకుంది. మహిళ కేకలు విన్న స్థానికులు ప్రమాద స్థలికి వచ్చి చూసే సరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. Your browser does not support the video tag. నాగమణి, నాగశివ దంపతుల మధ్య 3 నెలల క్రీతం వివాదం చోటు చేసుకుంది. ఇరువురి మధ్య మనస్పర్దలు రావడంతో ఇరువురు వేరు వేరుగా ఉంటున్నారు. ఉయ్యారులో 16వ వార్డుకు వాలంటీర్ గా వ్యవహరిస్తోన్న నాగమణి మూడు నెలల నుంచి తల్లితో ఉంటోంది. నిందితుడు మద్యం సేవించి పలు మార్లు నాగమణి వద్దకు వెళ్లి గొడవకుదిగేవాడని స్థానికులు అంటున్నారు. బాధితురాలి కూతురు తన తండ్రిని చూడటానికి అప్పుడప్పుడు వెళ్లేదని, కూతురితో మాట్లాడే సమయం నాగమణిని చంపుతానని బెదిరించేవాడని బాధితురాలి బంధువులు తెలిపారు. Your browser does not support the video tag. ప్రస్తుతం నామగణిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నాగశివ కూతరు అక్షయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నాగమణిపై అనుమానంతో భర్త ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు.. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. #uyyuru #nagamani #nagasiva #assassination-attempt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి