AP Assembly Meet: నేడు, రేపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈరోజు, రేపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9.44 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. తొలిరోజు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రెండో రోజు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. సాధారణ సభ్యుడిగానే వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు. By V.J Reddy 21 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP Assembly Meet: ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది.174 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయిస్తారు. మొదటగా సీఎం చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారు. తర్వాత మిగిలిన 23 మంది మంత్రుల ప్రమాణం చేయనున్నారు. మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. ఆ తర్వాత అక్షఱ క్రమంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది. సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు మాజీ సీఎం జగన్. అసెంబ్లీలో జగన్ సీటెక్కడ అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు పవన్ కళ్యాణ్. తొలిసారి అసెంబ్లీకి 80 మంది ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. రేపు స్పీకర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. #ap-assembly-meet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి