Gyanvapi Case: మసీదు కింద గుడి ఆనవాళ్లు.. జ్ఞానవాపి కేసులో ఏఎస్ఐ సంచలన నివేదిక!

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. ఆ ప్రాంతంలో మసీదు నిర్మించడానికి ముందు ఓ పెద్ద హిందూ దేవాలయం ఉన్నట్టు ఆ నివేదిక పేర్కొన్నదని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపారు.

New Update
Varanasi: మూడు దశాబ్దాల తర్వాత జ్ఞానవాపిలో హిందువుల పూజలు

Gyanvapi Case: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India) నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. ఆ ప్రాంతంలో మసీదు నిర్మించడానికి ముందు ఓ పెద్ద హిందూ దేవాలయం (Hindu Temple) ఉన్నట్టు ఆ నివేదిక పేర్కొన్నదని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ (Vishnu Shankar Jain) తెలిపారు. ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని నివేదిక సూచిస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్మాణానికి ఎలాంటి నష్టమూ జరగకుండా మసీదులో గుర్తించిన వస్తువులన్నిటినీ డాక్యుమెంట్ చేసినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: TSPSC: టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌.. వరుస నోటిఫికేషన్లు!

ప్రస్తుత నిర్మాణానికి ముందు అక్కడ ఆలయం ఉండేదని; దాని కోసం గతంలో ఆ ప్రాంతంలో ఉన్న మరో నిర్మాణానికి సంబంధించిన స్తంభాలను ఉపయోగించారని శాస్త్రీయ అధ్యయనం ద్వారా వెల్లడించినట్టు విష్ణుశంకర్‌ జైన్‌ పేర్కొన్నారు. ఆలయం కింది భాగంలో హిందూ దేవతల విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారని, 17వ శతాబ్దంలోనే ఆలయాన్ని కూల్చేసినట్లు ఏఎస్‌ఐ సర్వే తేల్చిందని చెప్పారు.


ఆలయ నిర్మాణానికి సంబంధించిన 34 శాసన ఆధారాలు లభించినట్లు పేర్కొన్నారు. శాసనాల్లో జనారదన, రుద్ర, ఉమేశ్వర పేర్లు కనిపిస్తున్నాయని జైన్ చెప్పారు. మహా ముక్తి మండపం వంటి పదాలు కూడా దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో వాటిలో ఉన్నాయని తెలిపారు. గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్(జీపీఆర్) సర్వే చేసినట్లు ఏఎస్‌ఐ సర్వే నివేదిక పేర్కొన్నదని జైన్‌ చెప్పారు. కాగా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే రిపోర్టును ఇరు పక్షాలకు ఇవ్వాలని బుధవారం వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి:  Padmasri Awards 2024: తెలుగు రాష్ట్రాల ‘పద్మశ్రీ’లు వీరే..

Advertisment
Advertisment
తాజా కథనాలు