Bihar: బీహార్ లో కూలిన మరో వంతెన!

బీహార్‌లో  మరో వంతెన కూలింది.గత 15 రోజుల్లోనే  7 బ్రిడ్జిలు కూలిపోవడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.కిసాన్‌గంజ్ జిల్లాలోని ఠాకూర్‌గంజ్ ప్రాంతంలో బండ్ నదిపై ఉన్న వంతెన నేలకొరిగింది.భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగి వంతెన నిర్మాణ గోడకు పగుళ్లు ఏర్పడి వంతెన కూలిపోయింది.

New Update
Bihar: బీహార్ లో కూలిన మరో వంతెన!

Bihar Bridge Collapse: బీహార్‌లో యునైటెడ్ జనతాదళ్-బీజేపీ పాలన సాగుతోంది. సివాన్ జిల్లాలో కంకై నదిపై ఈరోజు వంతెన కూలిపోయింది.15 రోజుల్లో ఒక్క బీహార్ రాష్ట్రంలోనే 7 వంతెనలు కూలిపోయాయి. కిసాన్‌గంజ్ జిల్లాలోని ఠాకూర్‌గంజ్ ప్రాంతంలో బండ్ నదిపై ఉన్న వంతెన కూలిపోయింది.ఇటీవల అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో వంతెన నిర్మాణ గోడకు పగుళ్లు ఏర్పడి వంతెన కూలిపోయింది.

అంతకు ముందు తూర్పు సంకరన్, అరారియా, సివాన్, కిషన్‌గంజ్, మధుబని తదితర ప్రాంతాల్లో వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని పాలక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శలు గుప్పించడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

Also Read: మూతపడనున్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ కూ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు