ఎల్ఓసీ వెంట టెర్రరిస్టులు..ఇద్దరిని మట్టుబెట్టిన సైన్యం..!!

జమ్మూకశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. అంతేకాదు ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత ఆర్మీ మట్టుబెట్టాయి.

New Update
ఎల్ఓసీ వెంట టెర్రరిస్టులు..ఇద్దరిని మట్టుబెట్టిన సైన్యం..!!

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయి. నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు యత్నించిన టెర్రరిస్టుల ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. ఇద్దరు చొరబాటుదారులను జవాన్లు హతమార్చారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు , భారత ఆర్మీ ఆపరేషన్ బహదూర్ ప్రారంభించింది. ఆ ప్రాంతంలో సైన్యం, పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

publive-image

హంద్వారాలోని వోద్‌పురా అటవీ ప్రాంతం నుంచి ఆర్మీతో కలిసి పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో 2 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. హంద్వారా పోలీసులతో పాటు సైన్యం వోధ్‌పురా అడవుల్లో తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో ఎన్‌హెచ్ 701 సమీపంలోని వోధ్‌పురా రిడ్జ్ నుండి సుమారు 5, 7 కిలోల రెండు ఐఇడిలు స్వాధీనం చేసుకున్నారు.

భద్రతా బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అవసరమైన చర్యలు చేపట్టాయి. ఐఈడీ లేదా ఉగ్రవాదులు ఎవరైనా దాగి ఉండే అవకాశం ఉన్నందున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. భద్రతా బలగాల సంయుక్త బృందం సత్వర చర్యతో ఆ ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది.

ఇదిలా ఉండగా.. ఈనెల 10వ తేదీన కూడా రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత సైన్యం తిప్పికొట్టింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టి విజయం సాధించింది. ఓ ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. ఆ ఉగ్రవాది సోమవారం రాత్రి నియంత్రణ రేఖ వెంబడి నౌషెరా సెక్టార్ లో చొరబాటుకు ప్రయత్నిస్తుండగా హతమార్చినట్లు సైన్యం తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు