APPSC : ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 240 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ ఈ నోటిఫికేషన్‌ ను విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. బోటనీ, కామర్స్‌ , కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఎకనామిక్స్, ఖాళీలకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

New Update
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

APPSC Lecturer Notification : ఏపీ(AP) లోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 240 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ ఈ నోటిఫికేషన్‌ ను విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ నోటిఫికేషన్‌ ప్రకారం... బోటనీ -19, కామర్స్‌-35 , కెమిస్ట్రీ-26, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌-26, ఎకనామిక్స్ -16, కంప్యూటర్‌ సైన్స్‌-31, ఎకనామిక్స్‌-16, మ్యాథ్స్‌ -17, ఫిజిక్స్‌ -11, పొలిటికల్ సైన్స్‌-21, జువాలజీ-19 విభాగాల్లో ఖాళీలకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఉద్యోగాలకు అప్లై(Apply Jobs) చేసుకోవాలనుకునే వారు సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ(Masters Degree) ఉత్తీర్ణులవ్వాలి. పీహెచ్‌డీ, నెట్‌/స్లెట్‌/సెట్‌ పరీక్షలు రాసి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు జులై 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

పరీక్ష లో రెండు పేపర్‌ లు ఉంటాయి. మొదటి పేపర్‌ లో జనరల్ స్టడీస్ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్‌) నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) , సంబంధిత సబ్జెక్టు (పీజీ స్టాండర్డ్‌) నుంచి 150 ప్రశ్నలు (300 మార్కులు) అడుగుతారు. ప్రతి పేపర్‌ కు 150 నిమిషాల సమయం ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు ఉంటుంది. దీనికి ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌ లైన్‌ దరఖాస్తులు(Online Applications) 24 జనవరి నుంచి 2024 ప్రారంభం అయ్యాయి. ఆన్ లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 13. దీనికి సంబంధించిన రాత పరీక్ష ఏప్రిల్‌ / మే 2024 లో ఉంటుంది.

ఈ నోటిఫికేషన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే https://psc.ap.gov.in/ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవాలి.

Also read: కస్తూర్భా కాలేజీలో విషాదం..ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు