YS Sharmila: సీఎం జగన్ పై షర్మిల విమర్శల బాణం

AP: జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోపై విమర్శలు చేశారు షర్మిల. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ఆమె ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఫైర్ అయ్యారు.

New Update
YS Sharmila: సీఎం జగన్ పై షర్మిల విమర్శల బాణం

YS Sharmila: వైసీపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గత ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టో.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారని సీఎం జగన్ ను ప్రశ్నించారు. పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు అని అన్నారు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు.. మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్మాలి? అని ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో తమ పార్టీ అదికారంలోకి రాగానే ఏపీలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన మీరు ఎందుకు ఆ హామీని పక్కకు పెట్టారు?, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఇచ్చేందుకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.. ఎందుకు చేయలేదు?.. ఐదేళ్లు అధికారంలో ఉన్న మీరు.. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేకపోయారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీలను ఇప్పటి వరకు భర్తీ చేయలేదని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎందుకు ఉద్యోగావకాశాలు కల్పించలేదు అని అన్నారు.

కేవలం వైసీపీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే వలంటీర్ పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. మెగా డీఎస్సీ బదులుగా దగా డీఎస్సీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు హడావిడిగా డీఎస్సీ ఇస్తారా? అని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీలో 54 ప్రాజెక్టులను వైఎస్సార్ తలపెట్టారు. అందులో 12 ప్రాజెక్టులను ఆయన పూర్తి చేశారని అన్నారు. 42 ప్రాజెక్టులు మిగిలాయని వైసీపీ ప్రభుత్వం లెక్కలు చెప్పిందని గుర్తు చేశారు. వైఎస్సార్ జలయజ్ఞాన్ని పూర్తిచేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టో వైసీపీ చెప్పిందని.. కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని మండిపడ్డారు. మూడు రాజధానులు అన్నారు.. ఏపీకి అసలు రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని చురకలు అంటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు