Kappatralla Murder Case: కప్పట్రాళ్ల హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు AP: కప్పట్రాళ్ల హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వెంకటప్పనాయుడు హత్య కేసులో ఆదోనీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు సహా 17మందిని నిర్దోషులుగా ప్రకటించింది. By V.J Reddy 07 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Kappatralla Murder Case: కప్పట్రాళ్ల హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వెంకటప్పనాయుడు హత్య కేసులో ఆదోనీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు సహా 17మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 2008 మే 17న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు సహా 11 మంది హత్యకు గురయ్యారు. బోదెపాడు వద్ద సినీఫక్కీలో లారీతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ ఘటనలో మొత్తం 42 మందిపై కేసు నమోదు అయింది. 2014 డిసెంబర్ 10న, 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ గతంలో ఆదోని కోర్టు తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు పడ్డ వారిలో నలుగురు అనారోగ్యంతో మృతి చెందారు. తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు నిందితులు. 17 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది హైకోర్టు. ప్రస్తుతం కప్పట్రాళ్ల గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. #kappatralla-murder-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి