Vivekam: 'వివేకం' సినిమాపై హైకోర్టులో విచారణ.. ఎన్నికల కమీషన్ కు కీలక ఆదేశాలు..!

ఏపీ హైకోర్టులో వైఎస్ వివేకా బయోపిక్ 'వివేకం' సినిమాపై విచారణ జరిగింది. సినిమాపై పూర్తి వివరాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. సినిమాలో తన పేరు వాడటంపై అప్రూవర్ దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

New Update
YSRCP: పోస్టల్ బ్యాలెట్ రూల్స్‌పై హైకోర్టుకు వైసీపీ

Vivekam: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి బయోపిక్ 'వివేకం' సినిమాపై విచారణ జరిగింది. ఈ సినిమాపై స్టే విధించాలని కేసులో కీలక నిందితుడిగా ఉన్న అప్రూవర్ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాను ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో సినిమాలో తన పేరు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో దాని ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Also Read: రాజ్ ప్లాన్ అదిరింది.. భార్యను ఎండీ చేయాలని నిర్ణయం..! షాక్ లో అపర్ణ

దీనిని పరిగణనలోకి తీసుకొని ఎన్నికలు ముగిసే వరకు వివేకం సినిమా నిలుపుదల చేయాలని దస్తగిరి కోరారు. విచారణ జరిపిన న్యాయస్థానం వివేకం సినిమాపై పూర్తి వివరాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఎన్నికల్లో జై భీమ్ భారత్ పార్టీ నుండి పులివెందులలో జగన్మోహన్ రెడ్డిపై దస్తగిరి పోటీ చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు