YCP MLC Appireddy: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ AP: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. By V.J Reddy 09 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YCP MLC Appireddy: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కేఎం కృష్ణారెడ్డి కోరడంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. మూడేళ్ల కిందట నమోదైన కేసును తెరపైకి తెచ్చి అరెస్టులు చేస్తున్నారన్నారు. పిటిషనర్ కు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరారు. పోలీసుల తరఫున జీపీ కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. తెదేపా పార్టీ కార్యాలయంపై 2021లో వైకాపా నేతల కనుసన్నల్లో మూకుమ్మడి దాడి చేశారన్నారు. అప్పట్లో కేసు నమోదు చేసినా.. దర్యాప్తులో పురోగతి లేదన్నారు. ప్రస్తుతం దర్యాప్తు మొదలు పెట్టేసరికి బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారన్నారు. అరెస్టు నుంచి రక్షణ ఇవ్వొద్దని కోరారు. #ycp-mlc-appireddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి