BREAKING: జగన్ భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు

మాజీ సీఎం జగన్ భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జగన్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది. జామర్ వెహికల్ కూడా కేటాయిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

New Update
Jagan: నేడు వైసీపీ ఎంపీలతో జగన్ కీలక భేటీ

Jagan: తనకు భద్రత పెంచాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్ ను ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్ కు గతంలో ఉన్న భద్రత కొనసాగించాలని.. ప్రస్తుతం ప్రభుత్వం ఆయనకు భద్రత తగ్గించిందని జగన్ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం  జగన్ భద్రతపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆయన మాజీ సీఎం అని.. ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని తెలిపింది. జగన్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది. జామర్ వెహికల్ కూడా కేటాయిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

కోర్టులో జగన్ పిటిషన్...

వైసీపీ అధినేత జగన్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఉన్న భద్రతను తిరిగి కొనసాగించాలని కోరారు. తనకు కేటాయించిన వాహనం మరమ్మతులకు గురవుతోందని పిటిషన్ లో పేర్కొన్నారు. తన భద్రతకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా తన సెక్యూరిటీని తొలగించిందని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. తనకు ఉన్న ప్రాణహాని ఉందని.. ఈ విషయాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం సెక్యూరిటీ తీసేసిందని ఆయన కోర్టుకు తెలిపినట్లు సమాచారం. జగన్ వేసిన పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారల తరువాత చేపడుతామని చెప్పింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు