AP Assembly: ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల ఏపీ శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. By V.J Reddy 25 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP Assembly: ఏపీ శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. పెండింగ్ బిల్లుల్లో రూ.93 వేల కోట్లు సీఎఫ్‌ఎంఎస్‌లోకి అప్‌లోడ్ చేయలేదని ప్రభుత్వం తెలిపింది. రూ.48 వేల కోట్ల మేర బిల్లులు అప్‌లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని వివరించింది. నీటి పారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు శ్వేతపత్రంలో వెల్లడించింది. * వివిధ ప్రాజెక్టులకు చెందిన రూ.19,324 కోట్ల మేర బకాయిలు గుర్తించారు. * ఆర్థిక శాఖ నుంచి రూ.19,549 కోట్ల బిల్లుల పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు * పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.14 వేల కోట్లకుపైగా బకాయిలు * మున్సిపల్ శాఖలో రూ.7,700 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి