AP Elections 2024: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటన

రెండో జాబితాపై కీలక ప్రకటన చేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. జనసేన, బీజేపీ పార్టీలు ఏఏ స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని స్పష్టం చేశారు.

New Update
CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో కీలక భేటీ!

TDP Second List: ఏపీలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu). ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ కలిసి 99 మంది ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఏపీలో బీజేపీ (BJP) తో పొత్తు కుదడంతో రెండో జాబితాపై కసరత్తు చేస్తున్నారు. తాజాగా రెండో జాబితాపై కీలక ప్రకటన చేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. మీడియాతో జరిగిన చిట్ చాట్ లో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన పై వివరణ ఇచ్చారు. రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎంతమంది వీలైతే అంతమంది తెలుగుదేశం అభ్యర్థుల్ని రేపు ప్రకటిస్తాం అన్నారు. తెలుగుదేశం అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకుందని పేర్కొన్నారు. జనసేన, బీజేపీ పార్టీలు ఏఏ స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని స్పష్టం చేశారు.

ALSO READ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కిడ్నాప్.. క్లారిటీ!

పవన్ కు షాక్..?

ఇటీవల పొత్తులో జనసేన – టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 99 ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించగా.. అందులో టీడీపీ 94 మంది, జనసేన (Janasena) 5 మందిని ప్రకటించింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు.. తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో పవన్ కు షాక్ ఇచ్చారు. 3 ఎంపీ స్థానాలను రెండు స్థానాలకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాకూండా ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కాకినాడ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

17న ఏపీకి మోడీ..

టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మోడీ పాల్గొనే సభకు ఒకరోజు అటు ఇటు అయినా సభ ఏర్పాటుకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని చంద్రబాబు ముఖ్య నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు