Lokesh : మరుగుదొడ్ల వద్ద వైసీపీ బోర్డు.. జగన్ పై లోకేష్ సెటైర్లు! సీఎం జగన్‌కు ప్రచార పిచ్చి పెరిగిపోయిందన్నారు లోకేష్. మరుగుదొడ్ల వద్ద కూడా జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల అని ఫ్లెక్సీ పెట్టారని ఎద్దేవా చేశారు. చేసిందేమీ లేకపోవడంతో చివరకు పాయిఖానాల వద్ద ఇలా బోర్డులు ఏర్పాటుచేసే దుస్థితికి చేరుకున్నారన్నారు. By V.J Reddy 06 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి TDP Lokesh Satires On CM Jagan : ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) జరగనున్నాయి. ఇప్పటికే అన్నీ రాజకీయ పార్టీలు ప్రచారాలు మొదలు పెట్టాయి. తమదైన శైలిలో ప్రచారాలు చేస్తూ ఓటర్లను తమవైపుకు తిప్పుకుంటున్నారు. అయితే.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని కాటవరం ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్ల వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష(Jagananna Arogya Suraksha) మూత్రశాల అని ఫ్లెక్సీ పెట్టారు. దీనిపై టీడీపీ(TDP) నేత నారా లోకెష్(Nara Lokesh) ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై(CM Jagan) చురకలు అంటించారు. ALSO READ: వైఎస్సార్ మరణంపై అనుమానాలు ఉన్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్ లోకేష్ ట్విట్టర్(X)లో.. 'ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచార పిచ్చి పీక్ స్టేజికి చేరింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కాటవరం మరుగుదొడ్ల వద్ద కూడా జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల అని ఫ్లెక్సీ పెట్టారట. చెప్పుకోవడానికి 4.9ఏళ్లలో చేసిందేమీ లేకపోవడంతో చివరకు పాయిఖానాల వద్ద కూడా ఇలా బోర్డులు ఏర్పాటుచేసే దుస్థితికి చేరుకున్నారు. అసమర్థ సిఎం పాలనలో ఉద్యోగాల్లేక రోజుకో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చదువుకున్న నిరుద్యోగులు దేశం మొత్తమ్మీద రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గంటూ చివరకు ఇలా ఫ్లెక్సీలు కట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు కిందకు దిగుతున్న ఇటువంటి పాలకుడ్ని ఏమనాలో మీరైనా చెప్పండి ప్లీజ్...!' అంటూ రాసుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచార పిచ్చి పీక్ స్టేజికి చేరింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కాటవరం మరుగుదొడ్ల వద్ద కూడా జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల అని ఫ్లెక్సీ పెట్టారట. చెప్పుకోవడానికి 4.9ఏళ్లలో చేసిందేమీ లేకపోవడంతో చివరకు పాయిఖానాల వద్ద కూడా ఇలా బోర్డులు… pic.twitter.com/wnER468fyt — Lokesh Nara (@naralokesh) January 6, 2024 ALSO READ: ఇస్రో రికార్డ్.. ఆదిత్య ఎల్-1 సక్సెస్ #tdp #ap-elections-2024 #cm-jagan #lokesh-satires-on-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి