Gorantla Butchaiah Chowdary: జగన్‌ను ఎర్రగడ్డలో పెట్టాలి.. బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్

సీఎం జగన్‌పై విమర్శలు దాడి చేశారు బుచ్చయ్య చౌదరి. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని వాడు.... వీడు అనకపోతే ఏమనాలి? అని ప్రశ్నించారు. జగన్‌ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Gorantla Butchaiah Chowdary: జగన్‌ను ఎర్రగడ్డలో పెట్టాలి.. బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్

Gorantla Butchaiah Chowdary Comments On CM Jagan: సీఎం జగన్ పై సెటైర్లు వేశారు టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కోడిగుడ్ల మీద లంగోటాల మీద జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ వేసుకుంటున్నాడని చురకలు అంటించారు. కేంద్రం ఇస్తున్న నిధులను తనిస్తునట్టుగా కల్ల బొల్లి కబుర్లు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఎందుకు ఉండాలి.. ప్రభుత్వ రికార్డుల్లో కేవలం ప్రభుత్వ ముద్ర మాత్రమే ఉండాలని అన్నారు.

సీఎం జగన్ ను (CM Jagan) ఎర్రగడ్డ ఆసుపత్రి లో పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని వాడు.... వీడు అనకపోతే ఏమనాలి? అని ప్రశ్నించారు. దుర్మార్గపు ప్రభుత్వం పోవాలని మేము అందరం కలిశామని పేర్కొన్నారు. నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో సీఎం జగన్ ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

వాలంటీర్లకు (AP Volunteers) ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. సచివాలయాలకు నగదు డిపాజిట్ కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం డబ్బులు డిపాజిట్ చేస్తే అరగంటలో పింఛన్లు ఇచ్చేయవచ్చు అని అన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ అవి నాలుక వేసుకోవడానికి కూడా పనిచేయవు.. పట్టాలు ఇచ్చారు ...కమిషన్లు కొట్టేసారు ... కానీ భూములు లేవు అని సెటైర్లు వేశారు.

బోగస్ ప్రకటనలు.. బోగస్ కాగితాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలని సీఎం జగన్ చూస్తున్నాడని అన్నారు. కాపు ఉద్యమం చేసి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఏం సాధించారు చెప్పాలి.. కాపులకు రిజర్వేషన్లు అక్కర్లేదు అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు మోస్తున్నావు? అని ముద్రగడను నిలదీశారు. కాపులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు విదేశీ విద్య అన్ని రద్దు చేశారని.. అయినా కానీ జగన్ ని ముద్రగడ మోస్తున్నారని విమర్శించారు.

Also Read: అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి ఈసీ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు