Kesineni Nani: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై కేశినేని నాని హాట్ కామెంట్స్

బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై కేశినేని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ఫైర్ అయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీ పెడితే.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని బీజేపీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏపీలో జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమన్నారు.

New Update
Kesineni Nani: మోదీ రోడ్ షో అట్టర్ ప్లాప్.. అలా అనుకోవడం కలే..!

Kesineni Nani: ఏపీలో రాజకీయాలు పొత్తుల నడుమ నడుస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ (TDP-Janasena-BJP Alliances) కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఈ పొత్తులపై వైసీపీ నేత కేశినేని నాని (Kesineni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ఫైర్ అయ్యారు. అన్న నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీ స్థాపించారని గుర్తు చేశారు. మూడు రోజుల నుంచి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాశాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టాడని విమర్శించారు.

ALSO READ: పొత్తులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. పవన్‌కు షాక్?

వైసీపీ 175 కి 175...

రానున్న ఎన్నికల్లో ఎంత మంది కలిసొచ్చినా ఏపీలో సీఎం జగన్‌ను ఓడించడం సాధ్యం కాదని అన్నారు కేశినేని నాని. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి 175/175 సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ దెబ్బకు చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందని అన్నారు. పవన జన సైనికుల ఆత్మ గౌరవాన్ని లోకేష్ దగ్గర తాకట్టు పెట్టాడని చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వార్ వన్ సైడే అని పేర్కొన్నారు.

120 సార్లు జగన్ బటన్ నొక్కారు..

సీఎం జగన్ ఐదేళ్ళ పాలనలో రాష్ట్రంలో 31 లక్షల పేదలకు నివాస స్థలాలు ఇచ్చారని అన్నారు. కోటి మందికి పైగా నీడ కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదని మండిపడ్డారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ, బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. పేదల సంక్షేమానికే 2.56 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని గుర్తు చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమానికి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన దాఖలలు లేవని పేర్కొన్నారు. 120 సార్లు పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ బటన్ నొక్కారని.. పేదల పక్షపాతి సీఎం జగన్‌కు ఓటు అనే బటన్‌ ప్రజలు నొక్కాలని పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు