MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కోర్టు బిగ్ షాక్ సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఆ పిటిషన్‌ను కొట్టేసింది. కవితను సీబీఐ విచారించేందుకు అనుమతించింది. ఈ నెల 15 వరకు మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. By V.J Reddy 12 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: సీబీఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. కవితను సీబీఐ విచారించేందుకు అనుమతించింది. ఈ నెల 15 వరకు మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. కాగా.. ఎక్సైజ్ పాలసీ కేసులో విచారించేందుకు ఎమ్మెల్సీ కవితను వారం రోజుల కస్టడీ ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరగా.. మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడే ఆమెను మూడు రోజుల పాటు విచారించనున్నారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఎమ్మెల్సీ కవితను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలిసేందుకు అనుమతించింది. A Delhi Court on Friday remanded BRS leader K Kavitha to Central Bureau of Investigation (CBI) custody till April 15 in the alleged liquor policy scam. Read more: https://t.co/P0FNPTCaI4#KKavitha #BRS #CBI #LiquorPolicyScam pic.twitter.com/etaNOsoxEA — Live Law (@LiveLawIndia) April 12, 2024 జైలులోనే కవిత అరెస్ట్... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ (CBI). ఎక్సైజ్ పాలసీ కేసులో (Excise Policy Case) కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడిలో ఉన్నారు కవిత. ఇటీవల జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court) పిటిషన్ ను సీబీఐ దాఖలు చేయగా.. దానికి సానుకూలంగా స్పందించిన కోర్టు.. కవితను విచారించేందుకు అనుమతించింది. కాగా ఈ నెల 6వ తేదీన జైలులో ఉన్న కవితను సీబీఐ ప్రశ్నించింది. అయితే కవితను విచారించేందుకు 7 రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ వేయగా.. కోర్టు మూడు రోజులకు అనుమతించింది. మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 16న కోర్టు విచారణ చేపట్టనుంది. గత నెల 15న లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. CBI కేసులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి.. #mlc-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి