MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు కోర్టును అనుమతి కోరింది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 05 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు కోర్టును అనుమతి కోరింది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరో వైపు ఇదే కేసులో విచారించేందుకు సీబీఐ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు పంపించగా.. కవిత మాత్రం సీబీఐ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరు కాలేదు. ALSO READ: చంద్రబాబు కీలక ప్రకటన 41ఏ కింద నోటీసులు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా ఛార్జిషీట్ లో సీబీఐ (CBI) చేర్చింది. ఈ మేరకు నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సమన్లు పంపింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు (Notices) పంపిన విషయం తెలిసిందే. 2022లో ఎమ్మెల్సీ కవిత ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సీబీఐ విచారణ చేపట్టింది. కవితకు బెయిల్ వస్తుందా? లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలు(Tihar Jail) లో ఉన్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని అందుకుగాను తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) లో పిటిషన్ దాఖలు చేసింది. కాగా కవిత వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును సోమవారం వెల్లడిస్తామని చెప్పింది. ఏప్రిల్ 20వ తేదిన ఉదయం 10.30 గంటలకు కోర్టు తన తీర్పును వెలువరించనుంది. కాగా.. కవితను గురువారం బెయిల్ వస్తుందని ఆశించించిన బీఆర్ఎస్ శ్రేణులకు, కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. మరి కవితకు కోర్టు బెయిల్ ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. #mlc-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి