టీఎస్పీఎస్సీ కేసులో మరో 15 మంది నిందితుల గుర్తింపు! By Bhavana 24 Jul 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ టీఎస్పీఎస్సీ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి సుమారు 90 మందిని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరికొద్ది రోజుల్లో ఈ సంఖ్య 100 కి చేరే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి మరో 15 మందిని నిందితులుగా గుర్తించినట్లు స్పెషల్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్స్ తెలిపారు. ఈ 15 మంది కూడా తమంతట తామే నేరాన్ని అధికారుల ముందు ఒప్పుకున్నారు. ఇదంతా కూడా కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే జరిగిందని సిట్ అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా మరో పది మందిని అరెస్ట్ చేయనున్నట్లు సిట్ అధికారులు వివరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు సిమ్ కార్డులు మార్చి పుణ్యక్షేత్రాలకు తిరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో తప్పించుకోలేమని తెలుసుకొని సిట్ ఎదుట లొంగిపోయారు. మార్చి నెల నుంచి ఈ కేసుకు సంబంధించిన విచారణను ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఈ కేసును ఎంతో ఛాలెంజ్ గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే మరికొందరి పేర్లు బయటపెడతామని కూడా అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక అందగానే రెండో చార్జిషీట్ దాఖలు చేయడానికి సిట్ సిద్ధమైంది. పేపర్ లీకేజ్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్ తేల్చింది. #tspsc-case #leakage #siit మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి