HappyDays: రీరిలీజ్‌కు సిద్ధమైన మరో క్లాసిక్ మూవీ.. థియేటర్లలో సందడి చేయనున్న హ్యాపీడేస్

ఇటీవల కాలంలో పాత సినిమాలను రీరిలీజ్ చేయడం ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా హీరోల బర్త్‌డేలు, ప్రత్యేక సందర్భాలలో సినిమాలు మళ్లీ విడుదల చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు మూవీ మేకర్స్. అందుకు తగ్గట్లే తమ హీరోల ట్రెండ్ సెట్టింగ్ మూవీలకు 4కె వర్షన్‌లో చూడటం కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు.

New Update
HappyDays: రీరిలీజ్‌కు సిద్ధమైన మరో క్లాసిక్ మూవీ.. థియేటర్లలో సందడి చేయనున్న హ్యాపీడేస్

HappyDays: ఇటీవల కాలంలో పాత సినిమాలను రీరిలీజ్ చేయడం ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా హీరోల బర్త్‌డేలు, ప్రత్యేక సందర్భాలలో సినిమాలు మళ్లీ విడుదల చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు మూవీ మేకర్స్. అందుకు తగ్గట్లే తమ హీరోల ట్రెండ్ సెట్టింగ్ మూవీలకు 4కె వర్షన్‌లో చూడటం కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఆయా సినమాలు రికార్డు కలెక్షన్స్ కూడా రాబట్టాయి. ఇదే నేపథ్యంలో మరో క్లాసిక్ మూవీ 'హ్యాపీడేస్' రీరిలీజ్‌కు సిద్ధమైంది. క్లాస్ దర్శకడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో యూత్‌ను ఓ ఊపు ఊపేసింది.

2007లో వచ్చిన ఈ సినిమాకి కాలేజ్ స్టూడెంట్స్ అయితే బ్రహ్మరథం పట్టారు. ఇంజనీరింగ్ కాలేజీ లైఫ్ నేపథ్యంలో తెరెకెక్కిన ఈ మూవీలో విద్యార్థుల మధ్య జరిగే గొడవలు, స్నేహాలు, ప్రేమలు, భవిష్యత్‌ లాంటి అంశాలను దర్శకుడు చాలా బాగా చూపించారు. ఇక మిక్కీ జే మేయర్ అందించిన మూవీలోని పాటలు అయితే ట్రెండింగ్‌గా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఫేరెవెల్ సందర్భంగా చిత్రంలో వచ్చే హ్యాపీడేస్.. హ్యాపీడేస్ సాంగ్ అయితే స్టూడెంట్స్ అందరినీ కంటతడి పెట్టించింది.  ఈ చిత్రంతోనే వరుణ సందేశ్, నిఖిల్, తమన్నా పేరు సంపాందించుకున్నారు. ఈ మూవీ విడుదలై ఈ ఏడాదితో 18 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అయింది.

తాజాగా హీరో నిఖిల్ " హ్యాపీడేస్ రీ రిలీజ్, ఓకేనా?" అంటూ ట్వీట్ చేశాడు. దీంతో రీరిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు. అయితే ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 28న మూవీ రీరిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ సినిమాలో నటించిన తమన్నా అయితే సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. నిఖిల్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ స్టార్ హీరో దిశగా ముందుకు వెళ్తున్నాడు. వరుణ్ సందేశ్ కూడా ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించి తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

ఇది కూడా చదవండి: ఆగేదే లేదు…పరిస్థితులు ఎలా ఉన్నా భగవంత్ కేసరి వచ్చేస్తాడు

Advertisment
Advertisment
తాజా కథనాలు